ePaper
More
    HomeసినిమాKota Srinivas Rao | ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత

    Kota Srinivas Rao | ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kota Srinivas Rao | ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్​లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. లెజెండరీ నటుడి మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మరణంపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు.

    Kota Srinivas Rao | బాల్యం నుంచే నాటకాలపై ఆసక్తి

    కృష్ణాజిల్లా కంకిపాడులో 1942 జులై 10న కోట జన్మించారు. బాల్యం నుంచే ఆయనకు నాటకాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. 1968లో రుక్మిణితో వివాహం జరగగా.. వారికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు జన్మించారు. కాగా.. 2010లో జరిగిన రోడ్డుప్రమాదంలో కోటా శ్రీనివాస్ కుమారుడైన ప్రసాద్ మరణించారు.

    Kota Srinivas Rao | అనేక నంది పురస్కారాలు

    కోట శ్రీనివాసరావు 1978లో సినీ రంగంలో అడుగు పెట్టారు. ప్రాణం ఖరీదు సినిమాతో అరంగెట్రం చేశారు. ప్రతి ఘటన చిత్రంతో ఆయనకు విలన్​గా మంచి గుర్తింపు వచ్చింది. అహ నా పెళ్లంట మూవీతో తిరుగులేని నటుడుగా ఎదిగారు. ఈ సినిమాలో ఆయన నటనతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.

    అయితే కోటా, బాబుమోహన్ ఇద్దరు కలిసిన సినిమా వచ్చిందంటే హిట్టే అనే టాక్ ఉండేది. వారిద్దరు కలిసి దాదాపు 50 సినిమాల్లో నటించారు. పిసినారి క్యారెక్టర్​తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే, విలన్​గా రాణించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కాగా ఆయన తన నటనతో తొమ్మిది నంది పురస్కారాలు దక్కించుకున్నారు.

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    More like this

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...