అక్షరటుడే, వెబ్‌డెస్క్: Russian woman : దట్టమైన అడవిలోని పర్వత ప్రాంతం.. కొండ గుహలో ఆదిమ మానవుల్లా.. తన ఇద్దరు పిల్లలతో సహా రష్యన్ మహిళ జీవనం.. కరెంట్ లేదు.. నీరు లేదు.. క్రూర మృగాలు, విష సర్పాల నడుమ ఏం తింటున్నారో.. ఎలా బతుకుతున్నారో.. తెలియని దీనస్థితిలో జీవితం నెట్టుకొస్తోంది.
కర్ణాటక Karnataka లోని గోకర్ణ Gokarna గుహ cave లో ఓ రష్యన్ మహిళ దుర్భర జీవనం గడుపుతోంది. పోలీసులు చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ సమీపంలోని రమతీర్థ పర్వతం ఉంది. ఈ ప్రాంతంలోని దట్టమైన అడవిలో ఉన్న గుహలో ఓ రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలను పోలీసులు గుర్తించారు. 40 ఏళ్ల ఆ రష్యన్ మహిళ పేరు నినా కుటినా Nina Kutina. ఆమెను “మోహి” అనే పేరుతోనూ పిలుస్తారు. ఆమెతోపాటు తన పెద్ద కూతురు ప్రేమ(6.5 ఏళ్లు), చిన్న కుమార్తె ఆమా(4 ఏళ్లు) ఉండటం గమనార్హం.
Russian woman : వెలుగులోకి ఇలా..

ఇటీవల కొందరు ట్రెక్కర్లు గోకర్ణ రామతీర్ధ పర్వతాన్ని Gokarna Ramatirtha mountain సందర్శించారు. అక్కడ గుహ వెలుపల బట్టలు ఆరేసి ఉండటం గమనించారు. ఈమేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు జులై 9, 2025న గుహను పరిశీలించారు. అలా ఈ రష్యన్ మహిళ విషయం వెలుగు చూసింది.
ఆధ్యాత్మిక శాంతి spiritual peace కోసం నినా ఇండియాకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. గోకర్ణ వంటి పవిత్ర ప్రదేశాలలో ధ్యానం కోసం నినా గుహలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఆమెకు ప్రకృతి, ప్రశాంతత అంటే మక్కువ ఉండటంతో నినా పిల్లలతో కలిసి గుహలోకి ఉంటున్నట్లు వెల్లడిస్తున్నారు.
Russian woman : ఎప్పటి నుంచి అంటే..
నినా తన పిల్లలతో కలిసి గత పదిహేను రోజులుగా గుహలో ఉంటున్నట్లు చెబుతున్నారు. కొద్దిపాటి పండ్లు, ప్రకృతి వనరులనే ఆహారంగా తీసుకుంటున్నారట. విద్యుత్తు, నీరు లేకుండానే గుహలో ఉంటున్నారు. పోలీసులు గుర్తించిన సమయంలో తల్లీపిల్లల ఆరోగ్యం బాగున్నట్లు చెబుతున్నారు.
Russian woman : పునరుద్ధరణకు నోచుకోని వీసా!
నినా బిజినెస్ వీసా business visa తో 2017లో ఇండియా India కు వచ్చినట్లు తెలిసింది. 2018లో ఆమె నేపాల్ Nepal వెళ్లి తిరిగి వచ్చింది. ఆ తర్వాత వీసా పునరుద్ధరణ జరగలేదు. దీంతో నినా అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా ఇండియాలో ఉంటున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Russian woman : తిరిగి పంపే పనిలో అధికారులు..
కర్వార్ Karwar లోని మహిళా రిసెప్షన్ సెంటర్కు రష్యన్ మహిళను తరలించారు. పిల్లలు కూడా తమ తల్లి వద్దే ఉన్నారు. ఆమెకు Foreigners Regional Registration Office (FRRO) నుంచి పిలుపు వచ్చింది. ఈ కార్యాలయం బెంగళూరులో ఉంది. రష్యా ఎంబసీతో మాట్లాడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఆమెను తన స్వదేశానికి తిరిగి పంపనున్నారు.
Russian woman : కేసులు తప్పవా…

గోకర్ణ గుహ Gokarna cave లో తన ఇద్దరు పిల్లలతో కలిసి నినా కుటినా నివసించడం సాధారణమైన విషయం కాదు. ఇది భద్రతా సమస్యలను సృష్టించే అంశం. దీనికితోడు వీసా ఉల్లంఘన అభియోగం కూడా ఆమెపై ఉంది. ఈ నేపథ్యంలో కేసులు నమోదైతే.. ఆమెను తిరిగి రష్యాకు పంపించడంలో న్యాయపరమైన చిక్కులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
కాగా, ఇద్దరు పిల్లలతో ఇండియాలో నినా ఉంటోంది. మరి, ఆమె భర్త ఎవరు..? ఎక్కడ ఉన్నాడు..? అసలు ఉన్నాడా..? అనే విషయాలు తెలియరాలేదు.