Outsourcing employees
Outsourcing employees | ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

అక్షరటుడే, ఇందూరు: Outsourcing employees | వెల్‌నెస్‌ సెంటర్లలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్​ చేయాలని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు (JAC leaders) డిమాండ్‌ చేశారు.

Outsourcing employees | వెల్​నెల్​ సెంటర్​లో నిరసన

ఈ సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్, తెలంగాణ వెల్నెస్ సెంటర్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (Telangana Wellness Centers Employees Association) ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. నగరంలోని వెల్​నెస్​ సెంటర్​లో శనివారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపామన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహాధర్నాకు సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థ రద్దుచేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని, లేదా ప్రత్యేక కార్పొరేషన్‌ ద్వారా జీతాలు చెల్లించాలని కోరారు.

Outsourcing employees | విధినిర్వహణలో భాగంగా మరణిస్తే..

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని​ డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్, హెల్త్‌ ఔట్‌సోర్సింగ్, కాంటాక్ట్‌ ఉద్యోగుల ట్రేడ్‌ యూనియన్, తెలంగాణ వెల్‌నెస్‌ కేంద్రాల ఉద్యోగుల అసోసియేషన్‌ నాయకులు, వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు(data entry operators), సిబ్బంది పాల్గొన్నారు.