ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Swachh Sarvekshan | ఆ ఐదు నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డులు

    Swachh Sarvekshan | ఆ ఐదు నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Swachh Sarvekshan | కేంద్ర ప్రభుత్వం తాజాగా వివిధ విభాగాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డులు (Swachh Sarvekshan Awards) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లోని ఐదు నగరాలకు అవార్డులు వరించాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, గుంటూరుకు స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డులు వచ్చాయి.

    జాతీయ స్థాయిలో ప్రత్యేక కేటగిరీ మినిస్టీరియల్‌ అవార్డును వైజాగ్​ దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో అవార్డుకు రాజమహేంద్రవరం నగరాన్ని ఎంపిక చేశారు. స్వచ్ఛ సూపర్‌లీగ్‌ నగరాల కేటగిరిలో గుంటూరు, విజయవాడ, తిరుపతి ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని ఐదు నగరాలకు అవార్డులు రావడంతో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పట్టాభిరామ్‌ స్పందించారు. సీఎం చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలతోనే ఈ అవార్డులు వచ్చాయన్నారు. ఆయా నగరాల స్వచ్ఛత కోసం కృషి చేసిన అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలకు పట్టాభిరామ్​ అభినందనలు తెలిపారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...