ePaper
More
    HomeతెలంగాణSiddipet | ఇన్సూరెన్స్​ డబ్బుల కోసం అత్త హత్య.. తర్వాత ఏం జరిగిందంటే..?

    Siddipet | ఇన్సూరెన్స్​ డబ్బుల కోసం అత్త హత్య.. తర్వాత ఏం జరిగిందంటే..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Siddipet | సమాజంలో రోజురోజుకు నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. డబ్బు, ప్రేమ, వివాహేతర సంబంధాల మోజులో చాలా మంది కన్న వారిని, కట్టుకున్న వారికి కూడా కడ తేరుస్తున్నారు. కొందరైతే కడుపున పుట్టిన పిల్లలను చంపేస్తారు. తాజాగా ఓ వ్యక్తి ఇన్సూరెన్స్(Insurance)​ డబ్బుల కోసం అత్తను హత్య చేయించాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు మామలు ఆ అల్లుడి ఆట కట్టించారు.

    సిద్దిపేట జిల్లా (Siddipet District) తొగుట మండలం తుక్కాపూర్​కు చెందిన వెంకటేశ్​ పౌల్ట్రీ ఫామ్‌ (Poultry Farm) పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయాడు. ఈ క్రమంలో తన అత్త రామవ్వను చంపి, అది ప్రమాదం చిత్రీకరించాలని చూశాడు.

    ఈ మేరకు ఆమెపై ముందుగానే రైతు బీమా (Farmers Insurance), పోస్టల్​ ఇన్సూరెన్స్ (Postal Insurance)​, ఎస్‌బీఐ ఇన్సూరెన్స్‌ (SBI Insurance) చేయించాడు. అనంతరం ఈ నెల 7న పొలం పని ఉందని చెప్పి అత్తను తీసుకు వెళ్లి కారుతో గుద్దించి హత్య చేశాడు. అనంతరం గుర్తు తెలియని కారు ఢీకొందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    Siddipet | దృశ్యం సినిమా చూసి..

    వెంకటేశ్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా వెంకటేశ్​ను అదుపులోకి తీసుకొని విచారించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. తన అత్త పేరిట ఇన్సూరెన్స్​ డబ్బుల కోసం కరుణాకర్​ అనే వ్యక్తికి వెంకటేశ్​​ రూ.1.50 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. దృశ్యం సినిమా చూసి హత్యకు ప్లాన్​ వేసినట్లు నిందితుడు చెప్పాడని సిద్దిపేట సీపీ అనురాధ(Siddipet CP Anuradha) తెలిపారు. ఈ మేరకు నిందితులను ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

    Latest articles

    Rusks | రస్క్‌లు తింటున్నారా? జాగ్రత్త.. ఈ ప్రమాదాలు తప్పవు!

    అక్షరటుడే, హైదరాబాద్ : Rusks | ఉదయం టీతో పాటు రస్క్‌లు తినడం మనలో చాలామందికి ఒక అలవాటు....

    August 21 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 21 Panchangam : తేదీ (DATE) – 21 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Almonds | బాదం.. ఆరోగ్యానికి ఎంతో బ‌లం.. ఒత్తిడి తొల‌గించ‌డానికి దోహ‌దం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Almonds | బాదంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. బాదంలు ఆరోగ్య‌ప‌రంగా మంచివ‌ని అందుకే మ‌న...

    Vice-Presidential elections | రసవత్తంగా రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఎన్నిక.. అసలు ఏమిటీ ఉపరాష్ట్రపతి పదవి..?

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice-Presidential elections : భారత్​లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు రసవత్తంగా మారాయి. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్‌ఖడ్ తన...

    More like this