ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Vijay Sai Reddy | మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి విజ‌య‌సాయి రెడ్డి..! ట్వీట్‌తో ఒక్క‌సారిగా హాట్ హాట్...

    Vijay Sai Reddy | మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి విజ‌య‌సాయి రెడ్డి..! ట్వీట్‌తో ఒక్క‌సారిగా హాట్ హాట్ చ‌ర్చ‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijay Sai Reddy | ఒక‌ప్పుడు వైసీపీ రాజ‌కీయాల‌లో చాలా కీల‌కంగా ఉన్న విజ‌య‌సాయి రెడ్డి కొన్ని నెల‌ల క్రితం రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌కటించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఆయ‌న పాలిటిక్స్‌కు దూరంగా ఉండి ఆరునెలలు కావొస్తున్నా ఇంకా వార్తల్లో ఉంటూనే ఉన్నారు.

    తాజాగా ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy) తాజా ట్వీట్‌ను చూస్తే, ఆయన మళ్లీ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ఆయన ఇప్పుడు ఎలాంటి ఆప్షన్లు వెతుకుంటున్నారు, ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందో అనే విషయాలపై ఆసక్తికర చర్చ మొదలైంది.

    Vijay Sai Reddy | ట్వీట్‌పైనే అంద‌రి దృష్టి..

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party) చెందిన కొందరు నేతలు విజయసాయిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని కోరుకుంటున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో కూడా ఆయన రీ ఎంట్రీపై చర్చ నడుస్తోంది. కొంతమంది అభినందిస్తుండగా, మరికొందరు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జగన్‌పై నేరుగా విమర్శలు చేయకపోయినా, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలపై విజయసాయి చేసిన విమర్శలు ఇంకా ఎవ‌రు మర్చిపోలేదు. “వైసీపీలోకి YCP వస్తే పార్టీకి ప్లస్ అవుతారు” అని కొందరు అంటుంటే, “జగన్‌కి ఆయనపై నమ్మకం లేదు” అనే అభిప్రాయాలు మరోవైపు వినిపిస్తున్నాయి.

    అయితే గతంలో పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బొత్స, ధర్మాన, వంశీలను కూడా జగన్ (YS Jagan) తిరిగి చేర్చుకున్న నేపథ్యాన్ని చూస్తే విజయసాయికి అవకాశం ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు అంటున్నారు. ఆయన్ని తిరిగి తీసుకున్నా, ఆయనకు కీలక పదవులు దక్కే అవకాశం తక్కువే అని వాదిస్తున్నారు.

    విజయసాయిరెడ్డికి ఉన్న రెండో ఆప్షన్ బీజేపీ(BJP). ఢిల్లీ స్థాయిలో ఆయనకు బీజేపీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. కేంద్ర బీజేపీ వర్గాలు ఆయన్ను స్వాగతించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పుడు అందరూ ఆయన ట్వీట్‌ను బీజేపీలోకి అడుగుపెట్టే సంకేతంగా చెబుతున్నారు.

    విజయసాయిరెడ్డి ట్వీట్(Vijayasai Reddy Tweet) చూస్తే.. “కర్మణ్యే వాధికారస్తే…” అనే శ్లోకం ఓ రాజకీయ సూచనగా భావిస్తున్నారు. భగవద్గీత శ్లోకం చెప్పిన విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నట్టు హింట్ ఇచ్చారని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. కర్మలను ఆచరించడంపైనే అధికారం ఉంటుందని వాటి ఫలితాలపై ఉండదని ఆయ‌న పేర్కొన్నారు. అయితే ఆ ఫలితాలకు కారణం కాకూడదని అలాగని పనులు చేయకుండా ఉండొద్దని తెలిపారు. ఈ ట్వీట్ ఆయ‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీ(Political Re-Entry) గురించే అంటున్నారు

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...