ePaper
More
    Homeక్రీడలుJasprit Bumrah | కపిల్ సరసన బూమ్రా.. విదేశాల్లో అత్యధికంగా 5 వికెట్లు తీసిన క్రికెటర్...

    Jasprit Bumrah | కపిల్ సరసన బూమ్రా.. విదేశాల్లో అత్యధికంగా 5 వికెట్లు తీసిన క్రికెటర్ గా రికార్డు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jasprit Bumrah | భారత పేసర్ జస్ ప్రీత్ బూమ్రా సరికొత్త రికార్డు సాధించాడు. విదేశాల్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన భారతీయ బౌలర్(Indian Bowler) గా చరిత్ర సృష్టించాడు. 12 సార్లు 5 వికెట్లు తీసిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సరసన నిలిచాడు. లార్డ్స్ టెస్టు(Lords Test)లో బూమ్రా ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజైన శుక్రవారం ఈ పేస్ బౌలర్ రెచ్చిపోయాడు. హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జో రూట్, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్ వికెట్లు పడగొట్టడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పాడు.

    Jasprit Bumrah | విదేశాల్లో 12 సార్లు..

    విదేశీ గడ్డపై అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్ గా బూమ్రా కపిల్ దేవ్(Kapil Dev) సరసన చేరాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లపై 4 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. అలాగే, దక్షిణాఫ్రికాపై 3 సార్లు, వెస్టిండీస్ పై రెండు సార్లు ఈ ఫీట్ ను సాధించాడు. విదేశాల్లో మొత్తంగా 12 సార్లు ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో బూమ్రా(Jasprit Bumrah) అద్భుతంగా రాణించాడు. హెడింగ్లీలో జరిగిన సిరీస్ తొలి టెస్టులో అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన రెండో టెస్ట్ నుంచి బూమ్రా విశ్రాంతి లభించింది. లార్డ్స్ టెస్టు తో తిరిగి జట్టులోకి వచ్చి ఈ పేస్ బౌలర్.. ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఇంగ్లిష్ జట్టు రెండో రోజు ఆరు వికెట్లు కోల్పోగా, అందులో ఐదింటిని బూమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.

    Jasprit Bumrah | వరల్డ్ రికార్డు..

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్లో(World Test Championship) భారతదేశం తరపున అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్ను బుమ్రా అధిగమించాడు. అశ్విన్ 11 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, హెడింగ్లీలో జరిగిన మొదటి టెస్ట్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత బుమ్రా అతనితో సమంగా నిలిచాడు. ఇప్పుడు లార్డ్స్లో మరోసారి ఐదు వికెట్ల ఫీట్ సాధించి అశ్విన్ను అధిగమించాడు.

    More like this

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...