ePaper
More
    HomeజాతీయంAhmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే..?

    Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం(Air India plane) జూన్​ 12న కూలిపోయిన విషయం తెలిసిందే.

    ఈ ఘటనలో విమానంలోని 241 మంది మృతి చెందారు. అంతేగాకుండా విమానం బీజే మెడికల్​ కాలేజీ భవనం(BJ Medical College Building)పై పడటంతో అందులోని వైద్య విద్యార్థులు కూడా చనిపోయారు. మొత్తం 270 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. అయితే విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే దానిపై తాజాగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక అందించింది.

    Ahmedabad Plane Crash | ఆ స్వీచ్​లు ఆగిపోవడంతో..

    అహ్మదాబాద్​ విమాన ప్రమాదం జరగడంతో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (Aircraft Accident Investigation Bureau) విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్​లు ఆగిపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా బ్యూరో నిర్ధారించింది.

    ప్రమాదానికి ముందు కాక్‌పిట్‌లో ఏ జరిగిందన్న వివరాలను నివేదికలో AAIB వెల్లడించింది. విమానం గరిష్ఠ వేగమైన 180 నాట్స్‌ను అందుకున్న మరుక్షణమే ‘రన్’ నుంచి ‘కటాఫ్’ పొజిషన్‌కు ఇంజిన్–1, ఇంజిన్ –2కు చెందిన ఇంధన స్విచ్​లు మారాయని తెలిపింది. ఇంధన సరఫరా నిలిచిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పేర్కొంది.

    ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజిన్లు రెండూ టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. దీంతో స్విచ్​లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్‌ను ప్రశ్నించగా తాను చేయలేదని ఆయన తెలిపారు. ఈ మేరకు బ్లాక్​ బాక్స్ ​(Black Box)లో రికార్డు అయింది. దీంతో ఎయిర్‌పోర్టు పెరీమీటర్ గోడను దాటిన వెంటనే ఎత్తు తగ్గుతూ వచ్చి కూలిపోయింది.

    Ahmedabad Plane Crash | మేడే సందేశం..

    మొదటి ఇంజిన్, రెండో ఇంజిన్ ఇంధన స్విచ్ ‘కటాఫ్’ నుంచి మళ్లీ ‘రన్’కు మారినా.. రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయింది. దీంతో మధ్యాహ్నం 1:39 గంటలకు పైలెట్​ మేడే కాల్ (Pilot Mayday Call) ఇచ్చారు. అనంతరం వెంటనే విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు. అందులో గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి విజయ్​ రూపాని కూడా ఉన్నారు.

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...