అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dattapeeta Express | చిక్కమంగళూరు – తిరుపతి మధ్య నడిచే రైలుకు దత్తపీఠ్ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. ఈ మేరకు కర్ణాటక బీజేపీ ఎంపీల ప్రతిపాదనకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) ఆమోదించారు.
దత్తపీఠ్ అనేది గురు దత్తాత్రేయ స్వామి(Guru Dattatreya Swamy) పేరు మీద వచ్చింది. అయితే ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి నడుస్తున్న 12762/61 కరీంనగర్ నుండి తిరుపతి నుండి కరీంనగర్ బైవీక్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా రాజరాజేశ్వర ఎక్స్‌ప్రెస్ (Rajarajeshwara Express) పేరు పెట్టాలని కొంతకాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ (12758/57 ) మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు కొమురంభీమ్ పేరు పెట్టాలనే ప్రతిపాదన కూడా ముందుకు కదలడం లేదు.
కాజీపేట నుంచి బల్లార్షా మధ్య నడుస్తున్న 17036/35 ఎక్స్ ప్రెస్ రైలును కాకతీయ రాణి రుద్రమ దేవి పేరు పెట్టాలని కొంతకాలంగా డిమాండ్ ఉంది. కరీంనగర్ నుంచి సిర్పూర్ టౌన్ మధ్య నడుస్తున్న పుష్ పుల్ రైలుకు మానేరు పుష్ పుల్ పేరుతో నడపాలనే ప్రతిపాదన కూడా ముందుకు కదలడం లేదు. పండరిపూర్ నుంచి నిజామాబాద్ మధ్య నడుస్తున్న రైలుకు విఠలేశ్వర ఎక్స్ ప్రెస్‌గా నామకరణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణలో మన చారిత్రక కట్టడాలు, గుళ్లు, నదులు, చరిత్ర కారుల పేరుతో రైళ్లను నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రావాలని కోరుతున్నారు.