అక్షరటుడే, వెబ్‌డెస్క్:DC vs RCB | బ్యాటింగ్ వైఫల్యంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) చేతిలో ఓటమి పాలయ్యామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్(Delhi Captain Axar Patel) తెలిపాడు. ఐపీఎల్(IPL) 2025 సీజన్‌లో భాగంగా ఆర్‌సీబీ(RCB) తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన అక్షర్ పటేల్.. బ్యాటింగ్ వైఫల్యంతో పాటు కీలక క్యాచ్‌లు వదిలేయడం తమ విజయవకాశాలు దెబ్బతీసిందని చెప్పాడు. డ్యూ కూడా ఈ మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు.
‘మా టార్గెట్‌కు 10 నుంచి 15 పరుగులు తక్కువగా చేశాం. తొలి ఇన్నింగ్స్ సమయంలో వికెట్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉంది. కానీ తేమ రావడంతో రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు సులువుగా మారింది. కీలక క్యాచ్‌లు వదిలేసాం. ఆ క్యాచ్‌లు అందుకుంటే ఫలితం మరోలా ఉండేది. వికెట్ టూ పేస్డ్‌గా ఉంది. బంతి ఆగుతూ వచ్చింది. వరుస విరామాల్లో వికెట్లు(Wickets) కోల్పోవడంతో పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం. మిడిల్ ఓవర్లలో ఒక్క బ్యాటర్ సెట్ అయ్యి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. సెట్ అయిన బ్యాటర్‌కు చివర్లో దూకుడుగా ఆడే అవకాశం దక్కేది. అప్పుడు మాకు కావాల్సిన లక్ష్యం వచ్చేది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే కేఎల్ రాహుల్‌ను(KL Rahul) అప్‌ది ఆర్డర్ బ్యాటింగ్ పంపించాం. ఈ మైదానంలో ఓ వైపు బౌండరీ చిన్నగా ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోవాలనే రాహుల్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపించాం.’అని అక్షర్ పటేల్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ (Delhi Capitals)నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం ఆర్‌సీబీ(RCB) 18.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 165 పరుగులు చేసి గెలుపొందింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో ఆర్‌సీబీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. ఢిల్లీ నాలుగో స్థానానికి పడిపోయింది.