అక్షరటుడే, భీమ్‌గల్: Trade license : దుకాణదారులు, వ్యాపారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని భీమ్‌గల్ మున్సిపల్ కమిషనర్ (Bhimgal Municipal Commissioner) గోపు గంగాధర్ స్పష్టం చేశారు. పట్టణంలో శుక్రవారం పలు దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణ గదుల కొలతల ఆధారంగా ఆన్‌లైన్‌లో లైసెన్స్ జారీ చేస్తామని, విధిగా లైసెన్సులు పొందాలన్నారు.
పునాది పూర్తయితే రూ. లక్ష జమ..
పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses) ను కూడా కమిషనర్ పరిశీలించారు. బేస్‌మెంట్ పూర్తయిన ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష నగదు జమవుతుందన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట మేనేజర్ నరేందర్, వార్డు అధికారులు, సిబ్బంది ఉన్నారు.