ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Sirikonda | ఇంటి యజమాని నిర్లక్ష్యం.. తవ్వి వదిలేసిన ఇంకుడు గుంతలో పడి బాలుడి దుర్మరణం

    Sirikonda | ఇంటి యజమాని నిర్లక్ష్యం.. తవ్వి వదిలేసిన ఇంకుడు గుంతలో పడి బాలుడి దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Sirikonda : అమ్మమ్మ ఇంటికి అమ్మతో కలిసి వచ్చాడు. అమ్మమ్మ, తాతయ్యలను చూసి మురిసిపోయాడు. వారు కొనిచ్చిన సైకిల్​ను ఇంటి ముంగిట సరదా తొక్కుతూ తన ప్రపంచంలో హ్యాపీగా ఉంటున్న ఆ బాలుడిని చూసిన విధికి కన్ను కుట్టిందేమో.. ఆ ముద్దులొలికే బాలుడి మురిపెం తీరకుండానే మృత్యు ఒడికి చేర్చాడు. దీంతో మూడేళ్లు కూడా నిండకుండానే ఆ బాలుడి నూరేళ్ల జీవితం అర్ధంతంగా ముగిసింది.

    ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యానికి చిన్నారి బాలుడు బలయ్యాడు. ఇంటి బయట ఇంకుడు గుంత తవ్వించి, వదిలేసిన ఆ ఇంటి యజమాని నిర్లక్ష్యానికి పాపం చిన్నారి బాలుడు తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇంటి వాకిట సైకిల్​ తొక్కుకుంటూ బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్​ జిల్లా సిరికొండ మండలంలో చోటు చేసుకుంది.

    Sirikonda : వివరాల్లోకి వెళ్తే..

    సిరికొండ మండలంలోని కొండాపూర్​కు చెందిన రాణికి నిజామాబాద్ రూరల్​ మండలం కులాస్​పూర్​కు చెందిన గంగసాయిలుకు వివాహం అయింది. వీరికి రిత్విక్​(3) అనే కుమారుడు ఉన్నాడు. కాగా, రాణి పక్షం రోజుల క్రితం తన పుట్టిళ్లు అయిన కొండాపూర్​కు వచ్చింది.

    కాగా, శుక్రవారం(జులై​ 11) మధ్యాహ్నం సమయంలో రిత్విక్​ ఇంటి బయట రోడ్డుపై చిన్న సైకిల్​ తొక్కుకుంటూ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఇంకుడు గుంతలో పడిపోయాడు. ఆ ఇంకుడు గుంత కొంత కాలం క్రితం తవ్వి అలాగే వదిలేయడంతో నీరు చేరి, మురుగు గుంతగా మారింది. రిత్విక్​ అందులో పడిపోవడంతో మురుగు నీటిలో మునిగిపోయాడు.

    బాబు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గాలించారు. మురుగు గుంతలో నురగలు రావడంతో అనుమానం వచ్చి చూడగా.. రిత్విక్​ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే నిజామాబాద్​ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

    Sirikonda : నిర్లక్ష్యమే బలిగొంది..

    బాలుడిని బలిగొన్న ఇంకుడు గుంతను ఇంటి యజమాని గత కొంత కాలం క్రితం తవ్వి అలాగే వదిలేశాడు. దీంతో ఇటీవల వర్షాలు కురిసి, మురుగు గుంతగా మారింది. దీనిని స్థానికులు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. పల్లెల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు లేకుండా పోయారు. అటు ఇంటి యజమాని నిర్లక్ష్యం వహించాడు. ఫలితంగా బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

    More like this

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...