Terror Attack | ఉగ్ర‌దాడికి కాశ్మీరీల సాయం.. 15 మందిని గుర్తించిన నిఘా వ‌ర్గాలు
Terror Attack | ఉగ్ర‌దాడికి కాశ్మీరీల సాయం.. 15 మందిని గుర్తించిన నిఘా వ‌ర్గాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terror Attack | జ‌మ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam) మారణహోమంపై నిఘా వ‌ర్గాలు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశాయి. దీని వెనుక ఉన్న పాత్ర‌ధారుల‌తో పాటు సూత్ర‌ధారుల పాత్ర‌పై ఆరా తీస్తున్నాయి. ఈ క్ర‌మంలో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ మారణహోమానికి పాకిస్తాన్ నుంచి వ‌చ్చిన ఉగ్ర‌వాదుల‌కు (Terrorists) స్థానికులు స‌హాయం చేసిన‌ట్లు నిఘా వ‌ర్గాలు గుర్తించాయి. వీడియోల‌తో పాటు ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ఆధారాలను బ‌ట్టి దుండగులకు సహాయం చేసిన 15 మందిని గుర్తించారు. ఉగ్ర‌వాదుల‌కు లాజిస్టిక్స్(Terrorists Logistics) ఏర్పాటు చేసిన గ్రౌండ్ వ‌ర్క‌ర్స్‌తో పాటు ఉగ్రదాడి సహాయకుల కోసం గాలింపు చేప‌ట్టారు. వీరికి పాకిస్తాన్ నుంచి ఆయుధాలు అందిన‌ట్లు నిఘా వ‌ర్గాలు అనుమానిస్తున్నాయి.

Terror Attack | అనుమానితుల విచార‌ణ‌

ద‌ర్యాప్తు బృందాలు(Investigation teams) ఇప్ప‌టికే ప‌లువురిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నాయి. కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఐదుగురిపై దృష్టి సారించిన నిఘా వ‌ర్గాలు.. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు ప్రధాన అనుమానితుల కోసం వెతుకుతున్నారు. దాడికి ముందు రోజుతో పాటు దాడి జ‌రిగిన స‌మ‌యంలోనూ వారు ఆ ప్రాంతంలోనే ఉన్న‌ట్లు ఫోన్ సిగ్న‌ల్స్‌(Phone Signals)ను బ‌ట్టి గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి కీల‌క ఆధారాలు సేక‌రించిన‌ట్లు తెలిసింది. పహల్గామ్‌లోని దాడికి పాల్ప‌డిన పాకిస్తాన్ ఉగ్రవాదుల(Pakistan Terrorists) గురించి. వారికి సహాయం చేయడం గురించి.. ముగ్గురు అనుమానితులు చేసుకున్న చాటింగ్ వివ‌రాల‌ను గుర్తించారు. మ‌రోవైపు, 200 మంది కంటే ఎక్కువ‌గా గ్రౌండ్ వ‌ర్క‌ర్స్(Ground Workers) ఉన్నార‌ని, వారిని అదుపులోకి తీసుకునేందుకు నిఘా వ‌ర్గాలు గాలిస్తున్నాయి.

Terror Attack | సంయుక్తంగా ద‌ర్యాప్తు

ప‌హ‌ల్గామ్ దాడి(Pahalgam Attack)పై వివిధ ద‌ర్యాప్తు సంస్థ‌లు సంయుక్తంగా ప‌ని చేస్తున్నాయి. ఎన్ఐఏ, రా, జ‌మ్మూకాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో బృందాలు స‌మ‌న్వ‌యంతో ద‌ర్యాప్తు జ‌రుపుతున్నాయి. గతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయం చేసిన మ‌రో ప‌ది మంది గ్రౌండ్ వ‌ర్క‌ర్ల‌ను విచారిస్తున్నాయి. ఏప్రిల్ 22న దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలోనే వారు ఉన్న‌ట్లు గుర్తించారు. “పహల్గామ్ దాడి బృందానికి ప‌ని సులభతరం చేసేందుకు, లాజిస్టిక్‌లను ఏర్పాటు చేయడంలో వారి పాత్రను సూచించే తగినంత సందర్భోచిత ఆధారాలు ఉన్నాయి, వీరిలో న‌లుగురు, ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారు, వీరిలో ఇద్దరు పాకిస్తానీలు, ఇద్దరు స్థానిక కాశ్మీరీలు ఉన్నారు. వీరికి తోడు 15 మంది గ్రౌండ్ వ‌ర్క‌ర్ల నుంచి మరిన్ని వివరాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నాము, వారి అరెస్టుపై నిర్ణయం తీసుకునే ముందు కుట్రను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాము” అని ఒక అధికారి తెలిపారు. మార‌ణ‌హోమం సృష్టించిన త‌ర్వాత బైసార‌న్ అడవుల్లోకి(Baisaran Forests) పారిపోయిన ఉగ్ర‌వాదుల కోసం భ‌ద్ర‌తా ద‌ళాలు అవిశ్రాంతంగా గాలిస్తున్నాయి. చుట్టుప‌క్క‌ల అడవుల‌ను అణ‌వణువునా జ‌ల్లెడా ప‌డుతున్నాయి.