ePaper
More
    Homeటెక్నాలజీOpen AI | ఓపెన్‌ ఏఐ నుంచి కొత్త బ్రౌజర్‌.. గూగుల్‌కు పోటీ ఇచ్చేనా?

    Open AI | ఓపెన్‌ ఏఐ నుంచి కొత్త బ్రౌజర్‌.. గూగుల్‌కు పోటీ ఇచ్చేనా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Open AI | ప్రముఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ అయిన ఓపెన్‌ ఏఐ(OPEN AI) గూగుల్‌ క్రోమ్‌(Google chrome)కు పోటీగా వెబ్‌ బ్రౌజర్‌(Web browser)ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది పూర్తిగా ఏఐ ఆధారితంగా పనిచేయనుంది. త్వరలోనే దీనిని లాంచ్‌ చేసే అవకాశాలున్నాయి.

    బ్రౌజర్లు ఎన్ని ఉన్నా.. ఏదైనా సమాచారం కోసం వెతికేటప్పుడు ఎక్కువగా గూగుల్‌పైనే ఆధారపడతాం. ఫైర్‌ఫాక్స్‌(Firefox), సఫారీ, ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌, ఒపెరా, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, బ్రేవ్‌, క్రోమియం, యూసీ బ్రౌజర్‌(UC browser) వంటి బ్రౌజర్లు ఉన్నా.. ఈ రంగంలో గూగుల్‌దే గుత్తాధిపత్యం. ఇంటర్నెట్‌లో సమాచారం వెతకడం అంటే గూగుల్‌ క్రోమే గుర్తుకు వస్తుంది. అయితే దీనికి పోటీ ఇవ్వడానికి ఓపెన్‌ ఏఐ కొత్త బ్రౌజర్‌ను తీసుకువస్తోంది.

    వినియోగదారుల డాటా, వెబ్‌ నావిగేషన్‌ (Web navigation) అలవాట్లను మరింత సుదీర్ఘంగా విశ్లేషించి, ఏఐ సామర్థ్యాన్ని వినియోగించేలా దీనిని రూపొందిస్తోంది. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పని చేయనుంది. ఈ బ్రౌజర్‌ మన అవసరాన్ని అర్థం చేసుకుని, అవసరమైన సమాచారాన్ని సులభంగా, క్లుప్తంగా అందిస్తుందని భావిస్తున్నారు. ఇది కేవలం ఇంకో బ్రౌజర్‌గా మాత్రమే నిలవదని, ఈ రంగంలో ఒక విప్లవాత్మక మార్పునకు నాందిగా మారవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓపెన్‌ ఏఐ విడుదల చేయబోయే కొత్త బ్రౌజర్‌ విస్తృతంగా ఉపయోగించబడితే అది గూగుల్‌ క్రోమ్‌ బౌజర్‌కు బలమైన పోటీదారుగా మారే అవకాశాలున్నాయి.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...