ePaper
More
    HomeజాతీయంTata Motors | ఆ కార్ల బ్యాటరీలపై బంపర్‌ ఆఫర్‌.. లైఫ్‌టైమ్‌ వారంటీ ప్రకటించిన టాటా

    Tata Motors | ఆ కార్ల బ్యాటరీలపై బంపర్‌ ఆఫర్‌.. లైఫ్‌టైమ్‌ వారంటీ ప్రకటించిన టాటా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Tata Motors | తన ఈవీ కార్ల వినియోగదారులకు టాటామోటార్స్‌(Tata motors) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టాటా కర్వ్‌(Tata Curvv EV), టాటా నెక్సాన్‌ ఈవీ(Tata Nexon EV) వాహనాలపై లైఫ్‌ టైమ్‌ హైవోల్టేజ్‌ బ్యాటరీ వారంటీ(Warranty)ని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు కార్ల 45 kWh బ్యాటరీ ప్యాక్‌ మోడళ్లకు ఈ వారంటీ వర్తించనుంది. ఈ ప్రయోజనం ప్రస్తుత యజమానులతో పాటు కొత్తగా ఈ రెండు విద్యుత్‌ ఎస్‌యూవీలు కొనుగోలు చేయబోతున్న వారికీ వర్తించనుంది.

    Tata Motors | హారియర్‌ ఈవీతో ప్రారంభం..

    టాటా మోటార్స్‌ ఇటీవల తీసుకువచ్చిన హారియర్‌ ఈవీతో లైఫ్‌ టైమ్‌ హెచ్‌వీ(HV) బ్యాటరీ వారంటీ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. 15 ఏళ్ల వరకు అపరిమిత కిలోమీటర్లను ఈ వారంటీ కవర్‌ చేస్తుంది. ఈవీ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి ఆందోళనలను పరిష్కరించేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు తాజాగా టాటా నెక్సాన్‌, కర్వ్‌ ఈవీలలోనూ ఈ సదుపాయాన్ని కల్పించింది.

    ప్రస్తుతం నెక్సాన్‌ ఈవీ 30 kWh, 45 kWh ప్యాక్‌లలో అందుబాటులో ఉంది. అయితే జీవిత కాల వారెంటీ బ్యాటరీ నెక్సాన్‌ ఈవీ 45 kWhకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. కర్వ్‌ ఈవీ 45 కిలోవాట్‌అవర్‌, 55 కిలోవాట్‌అవర్‌ బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తోంది. ఈ రెండు ప్యాక్‌లపైనా వారంటీ లభించనుంది. ఈ వారంటీ నిర్ణయం వినియోగదారులలో బ్యాటరీ రీప్లేస్‌మెంట్‌ ఖర్చు(Battery replacement cost)ల గురించిన ఆందోళనను తగ్గించడంతో పాటు, కార్ల రీసేల్‌ వాల్యూ కూడా పెంచుతుందని టాటా మోటార్స్‌ చెబుతోంది. దేశంలో ఈవీ కార్ల మార్కెట్‌ షేర్‌ పెంచుకోవడం కోసం ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

    Tata Motors | రూ. 12.49 లక్షలనుంచి..

    ప్రస్తుతం నెక్సాన్‌ ఈవీ ఎక్స్‌షోరూం(Ex showroom) ధరలు రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.19 లక్షల వరకు ఉండగా.. కర్వ్‌ ఈవీ ధరలు రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల మధ్యలో ఉన్నాయి. బ్యాటరీకి లైఫ్‌టైమ్‌ వారంటీ(Battery Lifetime warranty)తో ఈవీల దీర్ఘకాలిక రీసేల్‌ విలువ పెరగడంతో పాటు పదేళ్లలో రూ. 8 లక్షలపైనే నిర్వహణ వ్యయాలు ఆదా అవుతాయని కంపెనీ పేర్కొంది. ప్రత్యేక లాయల్టీ ప్రోగ్రాంలో భాగంగా ప్రస్తుతం టాటా నెక్సాన్‌ ఈవీ, కర్వ్‌ ఈవీలపై రూ. 50 వేల వరకు ప్రయోజనాలు అందిస్తున్నట్లు తెలిపింది.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...