ePaper
More
    HomeసినిమాKuberaa Movie | ఓటీటీలోకి కుబేర.. స్ట్రీమింగ్​ ఎప్పటి నుంచి అంటే..

    Kuberaa Movie | ఓటీటీలోకి కుబేర.. స్ట్రీమింగ్​ ఎప్పటి నుంచి అంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kuberaa Movie | బాక్స్​ ఆఫీస్​ వద్ద భారీ సక్సెస్​ అందుకున్న కుబేర సినిమా (Kuberaa Movie) త్వరలో ఓటీటీలోకి రానుంది. ధనుష్ (Hero Dhanush)​, నాగార్జున (Hero Nagarjuna), రష్మిక (Heroine Rashmika) ప్రధాన పాత్రల్లో నట్టించిన ఈ మూవీని శేఖర్​ కమ్ముల తెరకెక్కించిన విషయం తెలిసిందే.

    జూన్​ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్​ టాక్​ అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా బాగానే నిలిచింది. రూ.వంద కోట్లకు పైగా కలెక్షన్లతో మంచి విజయం సాధించింది. కాగా.. ఈ మూవీ జులై 18 నుంచి ఓటీటీలోకి రానుంది.

    కుబేర సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) దక్కించుకుంది. ఈ సినిమాను జులై 18 నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే భారీ సక్సెస్​ అందుకొని మంచి టాక్​ తెచ్చుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ (OTT) ప్రియులు కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్​ డేట్​ ప్రకటించడంతో వారు ఓటీటీలో చూడటానికి సిద్ధం అవుతున్నారు.

    Kuberaa Movie | కథ ఏమిటంటే..

    దేశంలోనే సంపన్నుడైన నీరజ్‌ మిత్ర ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావాలని కలలు కంటాడు. దీని కోసం ఆపరేషన్​ సాగర్​ ప్రాజెక్ట్​ను వినియోగించుకోవాలని భావిస్తాడు. అయితే దాని కోసం ఆయన రూ.50 వేల కోట్ల బ్లాక్​ మనీ చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ డబ్బు తరలించడానికి మాజీ సీబీఐ అధికారి దీపక్‌ తేజ్‌ (నాగార్జున) సాయం తీసుకుంటాడు. అయితే దీపక్​ నలుగురు బిచ్చగాళ్ల సాయంతో ఈ పనిని పూర్తి చేయాలని ప్లాన్​ వేస్తాడు. వారి ద్వారా బ్లాక్​ మనీ తరలించాలని యోచిస్తాడు. ప్లాన్ సక్సెస్​ అయ్యాక వారిని చంపేయాలని చూస్తాడు. అయితే బిచ్చగాళ్లలో ఒకడైన దేవా (ధనుష్​) డబ్బు తన ఖాతాలో పడగానే తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే..

    More like this

    Powergrid Jobs | ‘పవర్‌గ్రిడ్‌’లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Powergrid Jobs | ఫీల్డ్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ కోసం పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌...

    Edupayala | జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం

    అక్షరటుడే, మెదక్ ​: Edupayala | జిల్లాలోని పాపన్నపేట మండలంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత...

    Big Boss Season 9 | బిగ్‌బాస్ సీజన్ 9 రేప‌టి నుండి మొద‌లు.. కామనర్స్ vs సెలబ్రిటీలు థీమ్‌తో ఆదివారం గ్రాండ్ స్టార్ట్!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Big Boss Season 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్...