ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Nagarjuna Sagar | నాగార్జునసాగర్​కు భారీ వరద.. క్రస్ట్ గేట్లను తాకిన కృష్ణమ్మ..

    Nagarjuna Sagar | నాగార్జునసాగర్​కు భారీ వరద.. క్రస్ట్ గేట్లను తాకిన కృష్ణమ్మ..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarjuna Sagar | ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో నాగార్జున సాగర్​కు భారీగా వరద (Heavy Flood) వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ నీటి మట్టం 546 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్​ క్రస్ట్​గేట్లను (Project Crestgates) నీటిమట్టం తాకడం గమనార్హం.

    ప్రతి సంవత్సరం ఆగస్టులో నాగార్జున సాగర్​కు వరద వస్తుంది. అయితే ఈ ఏడాది నెల రోజుల ముందుగానే జలాశయంలోకి వరద రావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్​ (Srisailam Project) నుంచి నాగార్జున సాగర్​కు 1,48,736 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 546 అడుగులకు చేరింది. దీంతో అధికారులు జల విద్యుత్​ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించారు. కరెంట్ ఉత్పత్తి చేసి 13,566 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగితే ప్రాజెక్ట్​ మరో వారం రోజుల్లో నిండే అవకాశం ఉంది.

    Nagarjuna Sagar | శ్రీశైలంలో పర్యాటకుల సందడి

    ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తారు. మూడు గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగర్జున సాగర్(Nagarjuna Sagar)​ వైపు పరుగులు తీస్తోంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి పర్యాటకులు తరలి వస్తున్నారు. దీంతో శ్రీశైలం ఘాట్​ రోడ్డులో సందడి నెలకొంది. శని, ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్​ జామ్​ కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పర్యాటకులు కోరుతున్నారు.

    More like this

    CP Sai Chaitanya | పోలీస్​ ఇమేజ్​ పెంచేవిధంగా విధులు నిర్వర్తించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, బోధన్​: CP Sai Chaitanya | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పోలీస్​ ఇమేజ్​ను పెంచేవిధంగా సిబ్బంది విధులు...

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...