ePaper
More
    HomeజాతీయంTirumala Dairy | రూ.40 కోట్ల మోసం.. తిరుమల డెయిరీ మేనేజర్​ ఆత్మహత్య

    Tirumala Dairy | రూ.40 కోట్ల మోసం.. తిరుమల డెయిరీ మేనేజర్​ ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala Dairy | చెన్నై(Chennai)లోని తిరుమల డెయిరీ మేనేజర్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీలోకి విశాఖపట్నంకు చెందిన నవీన్‌ బొల్లినేని(37) చెన్నై మాధవరంలోని తిరుమల డెయిరీ(Tirumala Dairy)లో ట్రెజరీ మేనేజరుగా పని చేస్తున్నాడు. అయితే కంపెనీలో ఇటీవల రూ.40 కోట్ల మోసం జరిగింది. మనీ లాండరింగ్(Money Laundering)​ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నవీన్​కు నోటీసులు అందించారు.

    Tirumala Dairy | ఈ మెయిల్​ పంపి..

    కంపెనీ లెక్కల్లో నవీన్​ రూ.40 కోట్లు మోసానికి(Rs. 40 Crore Fraud) పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాను డబ్బు తిరిగి ఇస్తానని నవీన్​ ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే డబ్బులు ఆయన తిరిగి ఇవ్వలేకపోయాడు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు(Police Notice) అందించడంతో నవీన్‌ పుళల్‌ బ్రిటానియానగర్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు నవీన్​ తన సోదరికి ఈ మెయిల్​ పంపాడు. దీంతో కుటుంబ సబ్యులు వచ్చి చూసే సరికే నవీన్​ మృతి చెందాడు. తనను కొంతమంది అధికారులు బెదిరిస్తున్నారని ఈ మెయిల్​లో ఉన్నట్లు సమాచారం.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...