అక్షరటుడే, వెబ్డెస్క్ : Team India | భారత క్రికెట్ జట్టు సరికొత్త రికార్డును సాధించింది. వరుసగా 13 సార్లు టాస్ ఓడిపోయిన ఘనతను మూటగట్టుకుంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్-ఇండియా(England-India) మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ సందర్బంగా టాస్ వేయగా, ఇంగ్లాండ్ కు అనుకూలంగా వచ్చింది. ఇంగ్లాండ్ పర్యటనలో మూడో టెస్ట్ ఆడుతున్న భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్(Indian Test captain Shubman Gill) వరుసగా మూడుసార్లు టాస్ ఓడిపోయారు.
Team India | కలిసి రాని టాస్..
భారత జట్టుకు టాస్ కలిసి రాకపోవడం గత ఆర్నెళ్లుగా కొనసాగుతోంది. జనవరి 31 నుంచి పూణే(Pune)లో ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో T20తో మొదలైన ఈ టాస్ ఓటమి ఇంకా కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భారత్ ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ కలిసి రాలేదు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో వరుసగా మూడు టెస్టుల్లో టాస్ వేయగా, మూడింట్లోనూ భారత జట్టుకు పరాభవమే మిగిలింది. జనవరి 31 నుంచి మొదలైన ఈ పరంపర ఇంకా కొనసాగుతోంది. టీ20, చాంపియన్స్ ట్రోఫీతో పాటు ప్రస్తుత టెస్ట్ సిరీస్ లో కలిపి టీమిండియా(Team India) అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా 13 సార్లు టాస్ లను కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా రెండు T20లు, రోహిత్ శర్మ నాయకత్వంలో ఎనిమిది వన్డేలు, ఇప్పుడు గిల్ నాయకత్వంలో మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. అయితే, ఆయా మ్యాచ్ లలో టాస్ గెలువక పోయినా ఫలితాలు మాత్రం మనకు అనుకూలంగా వస్తున్నాయి. టాస్ గెలవకుండానే ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది,
Team India | వెస్టిండిస్ ను అధిగమించి..
గతంలో వరుసగా టాస్ ఓడిపోయిన జట్టుగా వెస్టిండిస్(West Indies) చెత్త రికార్డును మూట గట్టుకుంది. రెండుసార్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనలిస్ట్ జట్టు వెస్టిండీస్ నెలకొల్పిన రికార్డును ఇండియా బద్దలు కొట్టింది. 1999 ఫిబ్రవరి 2 నుంచి ఏప్రిల్ 21 వరకు వెస్టిండీస్ అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్లో(International Cricket) వరుసగా 12 సార్లు టాస్ కోల్పోయింది. ఇంగ్లాండ్ కూడా వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయింది.