ePaper
More
    Homeబిజినెస్​Pre Market Analysis | టారిఫ్‌ల అనిశ్చితి.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Pre Market Analysis | టారిఫ్‌ల అనిశ్చితి.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా స్పందిస్తున్నాయి. వాల్‌స్ట్రీట్‌ రికార్డు స్థాయి గరిష్టాల వద్ద ట్రేడవుతోంది. యూరోప్‌(Europe) మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఆసియా మార్కెట్లలోనూ ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి.

    Pre Market Analysis : యూఎస్‌ మార్కెట్లు(US markets)..

    ఎస్‌అండ్‌పీ(S &P) 0.27 శాతం, నాస్‌డాక్‌ 0.09 శాతం పెరిగాయి. Friday ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.40 శాతం నష్టంతో కొనసాగుతోంది.

    Pre Market Analysis : యూరోప్‌ మార్కెట్లు(European markets)..

    ఎఫ్‌టీఎస్‌ఈ(FTSE) 1.21 శాతం, సీఏసీ 0.30 శాతం పెరిగాయి. డీఏఎక్స్‌ 0.38 శాతం నష్టపోయింది.

    Pre Market Analysis : ఆసియా మార్కెట్లు(Asian markets)..

    ఆసియా మార్కెట్లు ఉదయం మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. ఉదయం 8.15 గంటల సమయంలో హంగ్‌సెంగ్‌(Hang Seng) 1.41 శాతం, షాంఘై 0.57 శాతం, స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.56 శాతం, షాంఘై 0.27 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.11 శాతం లాభంతో ఉన్నాయి. కోస్పీ 0.24 శాతం, నిక్కీ 0.13 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) 0.45 శాతం నష్టంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..

    • ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 221 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు నికరంగా రూ. 591 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
    • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 0.89 నుంచి 0.97 కు పెరిగింది. విక్స్‌(VIX) 2.24 శాతం తగ్గి 11.67 వద్ద ఉంది. ఇది 14 నెలల కనిష్టం.
    • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 69.06 డాలర్ల వద్ద ఉంది.
    • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 4 పైసలు బలపడి 85.64 వద్ద నిలిచింది.
    • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.36 వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 97.84 వద్ద కొనసాగుతున్నాయి.

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Trump) టారిఫ్‌ భయాలు కొనసాగుతున్నాయి. రోజూ కొన్ని దేశాలపై అదనపు సుంకాలు వడ్డిస్తున్నారు. తాజాగా కెనెడానుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 35 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. మిగతా దేశాలపై 15 నుంచి 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. టారిఫ్‌ల అనిశ్చితి కొనసాగుతుండడంతో మన మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

    More like this

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...