ePaper
More
    HomeతెలంగాణBonala celebration | బోనాల సంబరం.. రెండు రోజులు వైన్స్ షాప్స్ బంద్​.. ఎక్కడెక్కడంటే..

    Bonala celebration | బోనాల సంబరం.. రెండు రోజులు వైన్స్ షాప్స్ బంద్​.. ఎక్కడెక్కడంటే..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Bonala celebration : తెలంగాణ(Telangana)లో బోనాల పండగ (Bonala festival) సందడి నెలకొంది. ఈ క్రమంలో హైదరాబాద్​లోనూ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. లాల్​దర్వాజ (Lal Darwaja), గోల్కొండ (Golkonda), ఉజ్జయిని (Ujjain) అమ్మవారి బోనాలు వేడుకగా కొనసాగుతాయి.

    ఆదివారం(జులై 13) నుంచి మంగళవారం(జులై 15) వరకు ఉజ్జయిని మహంకాళి జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ (Secunderabad) పరిధిలోని సెంట్రల్, నార్త్, ఈస్ట్ జోన్​లలో వైన్స్ షాపులు బంద్ ఉండనున్నాయి. ఈమేరకు సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) ఆదేశాలు జారీ చేశారు.

    Bonala celebration : ఈ ప్రాంతాలలో ప్రభావం…

    ఇక ఉజ్జయిని మహంకాళీ బోనాల వేడుక (Ujjain Mahankali Bonala celebrations) నేపథ్యంలో రెండు రోజులపాటు వైన్స్ దుకాణాలు బంద్​ ఉండనున్నాయి. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ (Chilakalguda), గాంధీనగర్ (Gandhinagar), లాలాగూడ (Lalaguda), వారాసిగూడ (Varasiguda), గోపాలపురం (Gopalapuram), బేగంపేట్ (Begumpet), తుకారాంగేట్ (Tukaramgate), మారేడ్ పల్లి (Mared Pally), గోపాల్ పేట (Gopalpet), మహంకాళి (Mahankali) ప్రాంతాల్లో వైన్స్ షాపులను బంద్ చేయాలని సీపీ సీవీ ఆనంద్​ ఆదేశాలు జారీ చేశారు.

    Bonala celebration : శాంతిభద్రతల దృష్ట్యా..

    పండగల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల దృష్ట్యా వైన్స్ దుకాణాల బంద్​ నిర్ణయం తీసుకున్నారు. జంట నగరాల twin cities ప్రజలు ఇందుకు సహకరించాలని సీపీ కోరారు.

    More like this

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...