అక్షరటుడే, హైదరాబాద్: ACB Trap | అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ప్రజలను లంచాల కోసం వేధిస్తూనే ఉన్నారు. ఆపరేటర్ (Operator) నుంచి మొదలు పెడితే ఐఏఎస్ (IAS) అధికారుల వరకు లంచాల పేరిట ప్రజలను పట్టి పీడిస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. భయపడకుండా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు.
గచ్చిబౌలిలోని మహిళా పీఎస్ ఎస్సై వేణుగోపాల్ (Gachibowli female PS SI Venugopal) అవినీతికి పరాకాష్టగా మారాడు. అందినకాడికి దోచుకుంటున్నాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్లో సోదాలు చేపట్టారు.
ACB Trap | భయపడకుండా ఫిర్యాదు చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.