ePaper
More
    HomeజాతీయంJammu Kashmir | జమ్మూకశ్మీర్​లో భారీగా ఆయుధాలు స్వాధీనం

    Jammu Kashmir | జమ్మూకశ్మీర్​లో భారీగా ఆయుధాలు స్వాధీనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jammu Kashmir | భారత్​ ఆపరేషన్​ సిందూర్​తో (Operation Sindoor) పాకిస్తాన్​, ఆ దేశంలోని ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పిన విషయం తెలిసిందే. అయినా కూడా దాయాదీ దేశం బుద్ధి మార్చుకోవడం లేదు. డ్రోన్ల ద్వారా భారత్​లోకి ఆయుధాలు రవాణా చేస్తోంది. ఇక్కడ ఉన్న ఉగ్రవాదుల ద్వారా దాడులకు ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్​లో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

    జమ్మూ కశ్మీర్​లోని పూంచ్​ జిల్లాలో ఖానటర్ ప్రాంతంలో డ్రోన్ ద్వారా పేలుడు పదార్థాలు, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని జార విడిచారు. రోమియో ఫోర్స్, పూంచ్ SOG సంయుక్తంగా నిర్వహించిన సెర్చ్​ ఆపరేషన్​లో డ్రోన్​ వదిలిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఆరు చైనీస్ గ్రెనేడ్లు, రెండు పాకిస్తాన్ తయారు చేసిన పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, ఒక అండర్-బారెల్ గ్రెనేడ్ లాంచర్, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ (IED) రిమోట్ కంట్రోల్ ఉన్నాయి.

    Jammu Kashmir | తీరు మార్చుకోని పాకిస్తాన్

    పాకిస్తాన్​ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్​లోని (Jammu and Kashmir) పహల్గామ్​లో (Pahalgam) ఏప్రిల్​ 22న పర్యాటకులపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. అనంతరం భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి పాకిస్తాన్​(Pakistan), పీవోకేలోని (POK) తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో 100 మంది వరకు మరణించారు. అనంతరం పాక్​ ప్రతీకార దాడులు చేయడంతో భారత్​ తీవ్రంగా స్పందించింది. బ్రహ్మోస్(Brahmos)​ క్షిపణులతో పాక్​లోని ఎయిర్​బేస్​లు, మిలటరీ స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్​ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకు రాగా భారత్​ అంగీకరించింది. అయినా తీరు మారని పాకిస్తాన్​ మళ్లీ ఆయుధాలు పంపిస్తుండటం గమనార్హం.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...