ePaper
More
    HomeజాతీయంHaryana | హర్యానాలో దారుణం.. జుట్టు కత్తిరించుకోమన్నందుకు ప్రిన్సిపల్ హత్య

    Haryana | హర్యానాలో దారుణం.. జుట్టు కత్తిరించుకోమన్నందుకు ప్రిన్సిపల్ హత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Haryana | హర్యానాలోని హిసార్ జిల్లాలో (Hisar district) దారుణం చోటు చేసుకుంది. క్రమశిక్షణతో ఉండాలని, జుట్టు కత్తిరించుకోవాలని మందలించిన ప్రిన్సిపల్ పై ఇద్దరు విద్యార్థులు కక్షగట్టారు. గురు పౌర్ణిమ రోజైన (Guru Purnima Day) గురువారం నాడే ప్రిన్సిపల్ ను కత్తితో పొడిచి చంపారు. నార్నాండ్ ప్రాంతంలోని బాస్ గ్రామంలో జరిగిన ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది.

    Haryana | మందలించినందుకు..

    బాస్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ (Kartar Memorial Senior Secondary School principal).. క్రమశిక్షణ విషయంలో కాస్త కఠినంగా ఉంటారు. అయితే, ఇద్దరు విద్యార్థులు క్రమశిక్షణ పాటించక పోవడం, జుట్టు పెంచుకోవడాన్ని గమనించిన ఆయన వారిని మందలించారు. ప్రిన్సిపల్ తిట్టాడని ఆగ్రహానికి గురైన సదరు విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. కత్తితో ఆయనను పొడిచి హత్య చేశారని హన్సి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అమిత్ యశ్వర్ధన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్ష కోసం హిసార్ కు పంపించామని చెప్పారు. హత్యపై కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

    More like this

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...