అక్షరటుడే, వెబ్‌డెస్క్: government hospital : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆ జిల్లా కలెక్టర్ కోయ హర్ష సతీమణి విజయ డెలివరీ అయ్యారు. శస్త్రచికిత్స కాన్పులో రెండో కొడుకుకు విజయ జన్మనిచ్చారు. తల్లీకొడుకులిద్దరూ సురక్షితంగా ఉన్నారని స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ అరుణ తెలిపారు. కలెక్టర్ సతీమణి సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్నారు. అయినా, మొదటి నుంచి గోదావరిఖని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్ సింగ్, గైనకాలజిస్టు డాక్టర్ అరుణ పేర్కొన్నారు.
