ePaper
More
    Homeఅంతర్జాతీయంPakistani Former Minister | పాక్‌లో ఉగ్రవాద సంస్థలున్నది నిజమే.. అంగీకరించిన పాకిస్తాన్ మాజీ మంత్రి...

    Pakistani Former Minister | పాక్‌లో ఉగ్రవాద సంస్థలున్నది నిజమే.. అంగీకరించిన పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pakistani Former Minister | నిషేధిత ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహమ్మద్ (జేఎం) వంటి సంస్థాలు పాకిస్తాన్​లో ఇప్పటికీ మనుగడలో ఉన్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Former Foreign Minister Bilawal Bhutto Zardari) వెల్లడించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వదని, అయితే, ఉగ్ర భూతం వల్ల చాలా నష్టపోయిందని అంగీకరించారు. భారతీయ జర్నలిస్టు కరణ్ థాపర్(Indian journalist Karan Thapar)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక అంశాలు వెల్లడించారు.

    Pakistani Former Minister | పహల్గామ్ నిజమైన ఉగ్ర దాడే..

    జమ్మూ కశ్మీర్​లోని (Jammu and Kashmir) పహల్గామ్​లో ఇటీవల జరిగిన దాడి నిజంగానే ఉగ్రవాద దాడి బిలావల్ భుట్టో తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితులు, వారి కుటుంబాల బాధను తాను అర్థం చేసుకున్నానన్నారు. అయితే, పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ప్రభుత్వం (Pakistani government) లేదా సైన్యం ప్రమేయం లేదని, అవి తప్పుడు ప్రచారాలని స్పష్టం చేశారు. ఈ దాడిపై పాకిస్తాన్ నిష్పాక్షిక అంతర్జాతీయ దర్యాప్తు (international investigation) కోసం ముందుకొచ్చిందని, కానీ ఇండియా ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వదని.. దానివల్ల ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని నొక్కి చెప్పారు. “గత సంవత్సరం జరిగిన 200 కంటే ఎక్కువ ఉగ్రదాడుల్లో 1,200 మంది పౌరులు సహా మొత్తం 92,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయామని” వివరించారు. ఇది ఇలాగే కొనసాగితే 2025 పాకిస్తాన్ చరిత్రలో అత్యంత రక్తపాత సంవత్సరం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

    Pakistani Former Minister | ఉగ్రవాద సంస్థలు నిజమే..

    ఎల్ఈటీ, జేఎం వంటి గ్రూపులు పాకిస్తాన్​లో పని చేస్తున్నాయని భుట్టో అంగీకరించారు. ఈ గ్రూపులు ఆఫ్ఘన్ జిహాద్ సమయంలో ఉద్భవించాయని, వీటిలో పనిచేసిన వారు ఒకప్పుడు స్వాతంత్య్ర సమరయోధులుగా పరిగణించబడ్డారని తెలిపారు. తమ పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (Pakistan People Party) (పీపీపీ)తో పాటు తన తల్లి బెనజీర్ భుట్టో ఎప్పుడూ ఈ గ్రూపులకు మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు. 9/11 ఉగ్రదాడి తర్వాత ఆయా సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించామని, అప్పటి నుంచి పాకిస్తాన్ వాటికి వ్యతిరేకంగా వ్యవహరించిందని తెలిపారు. 2008 ముంబై ఉగ్ర దాడుల్లో (Mumbai terror attacks) బాధితులకు న్యాయం జరగడంలో జాప్యానికి భారతే కారణమని ఆరోపించారు. హఫీజ్ సయీద్ గురించి పదేపదే ప్రశ్నించగా, బిలావల్ చిరాకుగా వ్యవహరిస్తూ “మీరు సమాధానం వినకూడదనుకుంటే, నేను ఈ కార్యక్రమాన్ని వదిలి వెళ్తానని” హెచ్చరించారు.

    Pakistani Former Minister | పరస్పర సహకారం అవసరం..

    ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు ఇండియా, పాకిస్తాన్ (India – pakistan) పరస్పర సహకారంతో పని చేయాల్సిన అవసరం ఉందని బిలావల్ పేర్కొన్నారు. ఉగ్ర బాధితులు పడే బాధ ఎలా ఉంటుందో తనకు వ్యక్తిగతంగా తెలుసని, ఉగ్రవాద దాడిలో తన తల్లి హత్యకు గురైందని తెలిపారు. ద్వేషం, యుద్ధం గురించి మాట్లాడుకోవద్దని, ప్రతి పాకిస్తాన్ పౌరుడు ఉగ్రవాది లేదా శత్రువు కాదని పేర్కొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...