అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inspector Transfers | రాష్ట్రంలో పోలీసుల బదిలీలు(Inspector Transfers) కొనసాగుతున్నాయి. ఇటీవల పలువురు సీఐలు, ఎస్సైలు బదిలీ కాగా.. తాజాగా మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లకు స్థానం చలనం కల్పిస్తూ పోలీస్ శాఖ(Police Department) నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మల్టీ జోన్ –1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి(IG Chandrasekhar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద సీఐ జగడం నరేశ్‌ను (CI Jagadam Naresh) బదిలీ చేశారు. ఆయనను ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో బిచ్కుంద సీఐగా మంతెన రవికుమార్ రానున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్(Hyderabad)లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్నారు.