ePaper
More
    HomeతెలంగాణNizamabad Medical College | మెడికల్ కళాశాల ప్రిన్సిపల్​గా కృష్ణమోహన్ బాధ్యతల స్వీకరణ

    Nizamabad Medical College | మెడికల్ కళాశాల ప్రిన్సిపల్​గా కృష్ణమోహన్ బాధ్యతల స్వీకరణ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Medical College | నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్​గా డాక్టర్ ఎన్ కృష్ణమోహన్(Dr. N Krishnamohan) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల సూపరింటెండెంట్​ నాగరాజు, తదితర ఉద్యోగులు గురువారం ఆయనకు స్వాగతం పలికారు.

    Nizamabad Medical College | మహేశ్వరం మెడికల్​ కళాశాల ప్రొఫెసర్​గా..

    కృష్ణమోహన్​ ఇదివరకు మహేశ్వరం జిల్లా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్​గా పనిచేశారు. ప్రమోషన్​పై రెగ్యులర్ ప్రిన్సిపల్​గా నిజామాబాద్​(Nizamabad)కు బదిలీ అయ్యారు. ఇదివరకు ప్రిన్సిపల్​గా కొనసాగిన డాక్టర్ ఇందిరా(Dr. Indira) ఐదు నెలల క్రితం ఇతర జిల్లా నుంచి బదిలీపై వెళ్లారు. అప్పటినుంచి సైకియాట్రిస్ట్ డాక్టర్ శివప్రసాద్(Psychiatrist Dr. Sivaprasad) ఇన్​ఛార్జి ప్రిన్సిపల్​గా కొనసాగుతున్నారు. శివప్రసాద్ నుంచి ప్రిన్సిపల్​గా కృష్ణ మోహన్​ పూర్తి చార్జి తీసుకున్నారు.

    జీజీహెచ్​ సూపరిటెండెంట్​ వచ్చేనా..

    కాగా.. నిజామాబాద్​ జీజీహెచ్​ సూపరింటెండెంట్​గా నియమితులైన కృష్ణ మాలకొండరెడ్డి ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. ప్రభుత్వం ఆయనను సూపరింటెండెంట్​గా నియమించినా ఇప్పటి వరకు బాధ్యతల స్వీకరణపై ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఆయన వస్తారా లేదా అనే సంశయం నెలకొంది.

    కామారెడ్డి మెడికల్​ కాలేజీ, జీజీహెచ్​ పాలనాధికారుల బాధ్యతల స్వీకరణ

    కాగా.. కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్​గా డా.వాల్య, జీజీహెచ్ సూపరింటెండెంట్​గా డాక్టర్​ వెంకటేశ్వర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని పలువురు ప్రొఫెసర్లు, వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...