ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | మెడికల్​ కాలేజీ, జీజీహెచ్​ పాలనాధికారుల బాధ్యతల స్వీకరణ

    Kamareddy | మెడికల్​ కాలేజీ, జీజీహెచ్​ పాలనాధికారుల బాధ్యతల స్వీకరణ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్​గా డా.వాల్య (Dr. Valya) గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రొఫెసర్లు, వైద్యులు శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    మెడికల్ కళాశాల (Kamareddy medical college) సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, భవన నిర్మాణ పనులు త్వరగా చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్​గా డాక్టర్​ వెంకటేశ్వర్ (GGH Superintendent Dr. Venkateswar) గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఇన్​ఛార్జీగా పనిచేసిన డాక్టర్​ ఫరీదా బేగం పూర్తిస్థాయి సూపరింటెండెంట్​గా వచ్చిన డాక్టర్​ వెంకటేశ్వర్​కు బాధ్యతలు అప్పగించారు.

    ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సూపరింటెండెంట్ కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూపరిండెంట్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

    కాగా.. కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్​గా డాక్టర్​ వాల్య (Kamareddy Medical College Dr. Valya), జీజీహెచ్ సూపరింటెండెంట్​గా డాక్టర్​ వెంకటేశ్వర్​ను నియమిస్తూ ఇటీవల ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వారు నేడు బాధ్యతలు చేపట్టారు.

    More like this

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...

    CM Revanth Reddy | రాజ్​నాథ్​సింగ్​ను కలిసిన సీఎం.. రక్షణ శాఖ భూములు కేటాయించాలని వినతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి బుధవారం రక్షణ...

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...