Stock Market
Gift Nifty | నష్టాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | యూఎస్‌తో ట్రేడ్‌ డీల్‌, టారిఫ్‌ల విషయంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. యూఎస్‌, భారత్‌ల మధ్య మినీ ట్రేడ్‌ డీల్‌పై స్పష్టత లేకపోవడం, వివిధ దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌(Trump Tariff)ల మోతమోగిస్తుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. గురువారం ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 122 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 84 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి క్రమంగా 515 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ(Nifty) 35 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 13 పాయింట్లు మాత్రమే పెరిగింది. అక్కడినుంచి 149 పాయింట్లు క్షీణించింది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 288 పాయింట్ల నష్టంతో 83,247 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో 25,384 వద్ద కొనసాగుతున్నాయి. ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌(Infosys), విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, సిప్లా, దివిస్‌ వంటి స్టాక్స్‌ ఒక శాతానికిపైగా నష్టపోయాయి.

ఈరోజునుంచి ప్రధాన కంపెనీల Q1 ఎర్నింగ్‌ సీజన్‌ ప్రారంభం కానుంది. మొదట టీసీఎస్‌ ఫలితాలను ప్రకటించనుంది. ప్రస్తుతం ఐటీ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. యూఎస్‌తో వాణిజ్య అనిశ్చిత పరిస్థితికి తెరపడడం లేదు. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతోంది.

అమెరికా దిగుమతి చేసుకునే ఫార్మా(Pharma) ఉత్పత్తులపై గణనీయమైన స్థాయిలో టారిఫ్‌లు విధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో ఈ రోజు ఫార్మా స్టాక్స్‌ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.యూఎస్‌, భారత్‌ మధ్య మినీ ట్రేడ్‌ డీల్‌(MIni trade deal)పై స్పష్టత వస్తే మార్కెట్ల గమనం మారవచ్చని భావిస్తున్నారు.

Stock Market | ఐటీ, ఫార్మా రంగాలలో సెల్లాఫ్‌

ఐటీ(IT), ఫార్మా సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌ కూడా వరుస నష్టాలనుంచి తేరుకోవడం లేదు. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్‌ 0.50 శాతం, యుటిలిటీ ఇండెక్స్‌ 0.21 శాతం, ఇన్‌ఫ్రా 0.13 శాతం లాభాలతో సాగుతున్నాయి. ఐటీ ఇండెక్స్‌ 0.96 శాతం నష్టపోగా.. హెల్త్‌కేర్‌(Healthcare) 0.66 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.48 శాతం, ఆటో సూచీ 0.40 శాతం, ఎనర్జీ 0.38 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.30 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ ఫ్లాట్‌గా సాగుతుండగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.34 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.29 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో 21 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టాటా స్టీల్‌ 0.79 శాతం, మారుతి 0.68 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.54 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.45 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.26శాతం లాభాలతో సాగుతున్నాయి.

Top Losers:ఎయిర్‌టెల్‌ 1.57 శాతం, టెక్‌ మహీంద్రా 1.43 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.20 శాతం, ఇన్ఫోసిస్‌ 1.06 శాతం, ఎంఅండ్‌ఎం 0.98 శాతం నష్టాలతో ఉన్నాయి.