ePaper
More
    Homeఅంతర్జాతీయంTrump Tariff | ట్రంప్ ప‌న్నుల కొర‌డా.. బ్రెజిల్‌పై 50 శాతం సుంకం

    Trump Tariff | ట్రంప్ ప‌న్నుల కొర‌డా.. బ్రెజిల్‌పై 50 శాతం సుంకం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Trump Tariff | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కొర‌డా ఝ‌ళిపిస్తున్నారు. ఇప్ప‌టికే ఏడు దేశాల‌పై టారిఫ్‌లు విధించిన ఆయ‌న‌.. తాజాగా బ్రెజిల్‌ పైనా మోత మోగించారు. ఆగస్టు 1 నుంచి బ్రెజిల్ నుంచి దిగుమతులపై 50 శాతం సుంకం విధించ‌నున్న‌ట్లు ప్రకటించారు. బ్రెజిల్ ప్రభుత్వం(Brazil Government) అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అవ‌లంభిస్తోంద‌ని పేర్కొన్నారు. బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై అమెరికా విధించిన సుంకాలు చాలా త‌క్కువ అని పేర్కొన్నారు. ఈమేర‌కు ఆ దేశాధ్య‌క్షుడు ఇనాసియో లూల‌(Inacio Lula)కు లేఖ రాశారు. శ్రీలంక, అల్జీరియా, ఇరాక్, లిబియా, ఫిలిప్పీన్స్, మోల్డోవా, బ్రూనై దేశాల దిగుమతులపై ట్రంప్ కొత్తగా సుంకాలను ప్రకటించిన తర్వాత ఇప్పుడు బ్రెజిల్‌పై టారిఫ్‌లు పెంచడం గ‌మ‌నార్హం.

    Trump Tariff | చ‌క్ర‌వ‌ర్తి వ్యాఖ్య‌ల ప్ర‌భావం

    అమెరికా(America) వైఖ‌రిపై ఇటీవ‌ల బ్రెజిల్ అధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్య‌లే ట్రంప్ తాజాగా టారిఫ్‌లు (trump tariffs) పెంచ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి. ఇటీవ‌ల బ్రిక్స్ శిఖ‌రాగ్ర స‌మావేశం ముగింపు సందర్భంగా బ్రెజిల్ అధ్యక్షుడు ఇనాసియో లూల మాట్లాడుతూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచం ఇంత‌కు ముందులా లేద‌న్నారు. ప్ర‌పంచానికి చ‌క్ర‌వ‌ర్తి అవ‌స‌రం లేద‌ని అమెరికా పెద్ద‌న్న పాత్ర పోషించాల‌నే వైఖ‌రిని వ్య‌తిరేకిస్తూ వ్యాఖ్యానించారు. దీనికి తోడు బ్రిక్స్ దేశాలు అగ్ర‌రాజ్య ఆధిప‌త్య ధోర‌ణికి వ్య‌తిరేకంగా, డాల‌ర్‌కు ప్ర‌త్యామ్న‌యంగా క‌రెన్సీ తేవాల‌ని యోచిస్తుండ‌డం ట్రంప్‌కు ఆగ్ర‌హం తెప్పించింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న బ్రెజిల్‌పై కొర‌డా ఝ‌ళిపించారు.

    Trump Tariff | అన్యాయమైన వాణిజ్య పద్ధతులు..

    బ్రెజిల్ ప్రభుత్వం అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అవ‌లంభిస్తోంద‌న్న ట్రంప్‌.. ఆ దేశం నుంచి దిగుమ‌త‌య్యే అన్ని వ‌స్తువుల‌పై 50 శాతం టారిఫ్ విధిస్తున్న‌ట్లు తెలిపారు. “బ్రెజిల్‌తో మా వాణిజ్య సంబంధాన్ని చర్చించడానికి మాకు చాలా సంవత్సరాలు పట్టింది. టాక్స్‌, టాక్సేత‌ర విధానాలు, వాణిజ్య అడ్డంకుల వల్ల ఏర్పడిన దీర్ఘకాలంగా కొన‌సాగిన‌ అన్యాయమైన వాణిజ్య సంబంధం నుంచి దూరంగా ఉండాలని మేము నిర్ధారించాము. దురదృష్టవశాత్తు, మా సంబంధం పరస్పరం కాదని” పేర్కొన్నారు.

    Trump Tariff | బోల్సోనారో గౌర‌వ‌ప్ర‌ద‌మైన నేత‌

    మ‌రోవైపు, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (బ్రాజిలి Former President Jair Bolsonaro) విచారణను ఆయ‌న త‌ప్పు బ‌ట్టారు. ఈ మేర‌కు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూల‌ డ సిల్వాకు రాసిన రాసిన లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. తనకు బోల్సోనారో తెలుసునని, అతనితో పని చేశానని. ఆయ‌నంటే ఎంతో గౌరవమ‌ని వివ‌రించారు. “నేను మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోతో క‌లిసి ప‌ని చేశాను. ఇత‌ర దేశాల మాదిరిగానే అతనిని ఎంతో గౌరవించాను. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోతో తన పదవీకాలంలో, యునైటెడ్ స్టేట్స్‌(United States)తో సహా, ప్రపంచవ్యాప్తంగా అత్యంత గౌరవనీయమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయ‌న ప‌ట్ల వ్యవహరించిన విధానం అంతర్జాతీయంగా అవమానకరం. ఈ విచారణ జరగకూడదని” పేర్కొన్నారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...