అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre-release event : ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సినిమాకు ప్రేక్షకులను మరింత దగ్గర చేసే వేడుక. సినిమా యూనిట్ ను అభినందించడం, తమకు సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపడం వగైరా ఉంటాయి. ఇదంతా సరదాగా సాగిపోతుంటుంది. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ తమిళ దర్శకుడు ప్రియురాలికి ప్రపోజ్ చేయడం హాట్ టాక్ గా మారింది.
కోలీవుడ్ సీనియర్ నటుడు శశి కుమార్ Kollywood senior actor Shashi Kumar హీరోగా చేసిన టూరిస్టు ఫ్యామిలీ Tourist Family అనే సినిమాతో అభిషన్ జీవంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల చెన్నై Chennai లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు సినిమా యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కాగా, దర్శకుడు అభిషన్ director Abhishan టూరిస్టు ఫ్యామిలీ ప్రీ రిలీజ్ వేదికపై నుంచి తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటానని, ఇందుకు ఆమె ఒప్పుకోవాలని కోరుతూ ప్రపోజ్ చేశాడు. ఇదే ఈవెంట్ కు వచ్చిన అతగాడి ప్రేయసి మనోడు ఇచ్చిన షాక్‌కి ఆనందంలో కంటతడి పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన టూరిస్టు ఫ్యామిలీ మే 1 న రిలీజ్ కాబోతోంది.
Beautiful Proposal by The Director of #TouristFamily on Stage ❤️
— Christopher Kanagaraj (@Chrissuccess) April 27, 2025