అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pooja Hegde | కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Super star Rajinikanth) లీడ్ రోల్లో నటిస్తున్న కూలీ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (director Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, తెలుగు సహా పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో విడుదల అవుతుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోంది. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన విడుదలవుతుంది. ఈ సినిమాకు తెలుగు థియేట్రికల్ హక్కుల కోసం సినీ వర్గాల్లో పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఈ డీల్ కోసం రూ.40-45 కోట్లు చెల్లించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొదటగా, అన్నపూర్ణ స్టూడియోస్ కూలీ రైట్స్ తీసుకున్నట్టు వార్తలు రాగా, తర్వాత అది అవాస్తవం అని తెలిసింది.
Pooja Hegde | క్రేజీ సాంగ్..
ఆ తర్వాత, మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు (Producer dil raju), ఆసియన్ సునీల్, సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి ప్రముఖ సంస్థలు ఈ హక్కులను దక్కించుకోవడానికి పోటీ పడ్డాయట. అయితే ఏషియన్ సునీల్ ఫ్యాన్సీ ఆఫర్‌తో కూలీ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే, ఆసియన్ సునీల్ రజినీకాంత్ (Super star Rajinikanth) కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన జైలర్ సినిమాను (Jailer movie) విడుదల చేసి భారీ లాభాలు రాబట్టారు. ఈ సినిమాతో ఆసియన్ సినిమాస్ దుమ్ము రేపుతూ డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు, కూలీకి సంబంధించి కూడా అదే విధంగా సన్ పిక్చర్స్ సంస్థతో కలిసి అంగీకారం కుదుర్చుకున్నట్లు సమాచారం.
సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి, తద్వారా ఇది తెలుగులో గ్రాండ్‌గా విడుదల అయ్యే అవకాశం ఉంది. కూలీ సినిమా (Coolie Movie) అద్భుతమైన విజయం సాధిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు, అలాగే మేకర్స్ కూడా అదే ఉత్సాహంతో సినిమా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. మోనికా పాత్రలో పూజా హెగ్డే (Heroine Pooja Hegde) నటిస్తుండగా, ఆమెకి సంబంధించిన సాంగ్‌ని జులై 11, సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ పాటలో అక్కినేని నాగార్జున.. పూజ హెగ్డే జంటగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ పాటకు సంగీత దర్శకుడు అనిరుద్ ఒక ప్రత్యేకమైన ట్యూన్ అందించినట్టు ఫిలింనగర్ టాక్. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా, ‘వార్ 2’ సినిమాకి పోటీగా రానుంది.