Stock Market
Stock Market | ఐటీ, ఆటో రంగాల్లో అమ్మకాల ఒత్తిడి.. మూడో రోజూ నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock Market | యూఎస్‌ ట్రేడ్‌ పాలసీలు(US trade policies), వివిధ దేశాలపై విధించిన అదనపు సుంకాలు గ్లోబల్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. యూఎస్‌, భారత్‌ల మధ్య మినీ ట్రేడ్‌ డీల్‌(Mini trade deal) ప్రకటన ఆలస్యం అవుతుండడంతో మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. బుధవారం ఉదయం సెన్సెక్స్‌ 87, నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు సెన్సెక్స్‌ 83,519 నుంచి 83769 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ(Nifty) 25,472 నుంచి 25,548 పాయింట్ల మధ్యలో కదలాడాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో సూచీలు పతనమయ్యాయి. చివరలో కాస్త కోలుకుని సెన్సెక్స్‌(Sensex) 176 పాయింట్ల నష్టంతో 83,536 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 25,476 వద్ద స్థిరపడ్డాయి.

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,076 కంపెనీలు లాభపడగా 1,926 స్టాక్స్‌ నష్టపోయాయి. 140 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 130 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 41 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Stock Market | మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్లలో సెల్లాఫ్‌

ఎఫ్‌ఎంసీజీ(FMCG), కన్జూమర్‌ డ్యూరెబుల్‌ సెక్టార్లలో కొనుగోళ్ల మద్దతు కనిపించగా.. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌, రియాలిటీ సెక్టార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ 0.74 శాతం, బీఎస్‌ఈ సర్వీసెస్‌ 0.54 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ సూచీ 0.47 శాతం, ఆటో 0.40 శాతం, యుటిలిటీ ఇండెక్స్‌ 0.28 శాతం పెరిగాయి. మెటల్‌(Metal) 1.41 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 1.41 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 1.40 శాతం, ఎనర్జీ 0.99 శాతం, ఐటీ 0.80 శాతం, టెలికాం 0.47 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.45 శాతం, కమోడిటీ 0.40 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.45 శాతం లాభపడగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.18 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.05 శాతం నష్టాలతో ముగిశాయి.

Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో 17 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 1.40 శాతం, హెచ్‌యూఎల్‌ 1.26 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 0.90 శాతం, పవర్‌గ్రిడ్‌ 0.59 శాతం, ఆసియా పెయింట్‌ 0.57 శాతం లాభాలతో ముగిశాయి.

Top Loser:హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.03 శాతం, టాటా స్టీల్‌ 1.82 శాతం, టెక్‌ మహీంద్రా 1.39 శాతం, రిలయన్స్‌ 1.28 శాతం, బీఈఎల్‌ 1.01 శాతం నష్టపోయాయి.