అక్షరటుడే, హైదరాబాద్: Ministers’ counter : బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు స్పందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి minister ponguleti srinivas reddy మాట్లాడుతూ.. “కేసీఆర్ మంచి సూచనలు చేస్తారేమో అనుకున్నాం.. కానీ, ఆయన మనసంతా విషం నింపుకొన్నారు.. కాంగ్రెస్‌ను విలన్‌గా చిత్రీకరించే పనిలో ఉన్నారు.. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా?..” కేసీఆర్ వల్ల ధనిక తెలంగాణ కాస్త అప్పుల రాష్ట్రంగా మారిందని విమర్శించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు jupally krishna rao మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ కు అప్పజెప్పితే.. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసింది నిజమా, కాదా..? నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కింద కట్టాల్సి వస్తోందని అని అన్నారు.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ mlc addanki dayakar మాట్లాడుతూ.. కేసీఆర్ హింసరాజ్‌లాగా మారిపోయారని విమర్శించారు. చెప్పిందే చెప్పి.. పాత చింతకాయ పచ్చడిలా కేసీఆర్ ప్రసంగం ఉందని అన్నారు. కొత్త సీసాలో పాత సారాయిలాగా కేసీఆర్ స్పీచ్ ఉందంటూ దెప్పిపొడిచారు.