ePaper
More
    Homeటెక్నాలజీGoogle AI Mode | మరింత సమగ్ర సమాచారం కోసం.. గూగుల్‌లో కొత్త ఏఐ మోడ్‌

    Google AI Mode | మరింత సమగ్ర సమాచారం కోసం.. గూగుల్‌లో కొత్త ఏఐ మోడ్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Google AI Mode | ప్రస్తుతం టెక్నాలజీ రంగాన్ని ఏఐ(AI) శాసిస్తోంది. అడిగిన సమాచారాన్ని క్షణాల్లో అందిస్తూ యూజర్లకు ఉపయోగపడుతోంది. పోటీలో నిలవడానికి ప్రధాన టెక్‌ కంపెనీలు ఏఐ ఫీచర్ల(AI features)ను తమ వినియోగదారులకు అందిస్తున్నాయి. గూగుల్‌(Google) తాజాగా భారత్‌లో మరో ఏఐ మోడ్‌ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌ దశలో, ఇంగ్లిష్‌(English)లో అందుబాటులో ఉంది. త్వరలోనే భారతీయ భాషలలో తీసుకువచ్చే అవకాశాలున్నాయి. కొత్త ఏఐ మోడ్‌ గురించి తెలుసుకుందామా..

    గ్లోబల్‌ టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ తన సెర్చ్‌ ల్యాబ్స్‌ ప్రయోగంలో భాగంగా భారత్‌లో కొత్త ఏఐ మోడ్‌(New AI Mode)ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న సెర్చ్‌ ఫలితాలతో పోలిస్తే మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు దీనిని రూపొందించారు. ఇది గత సెర్చ్‌ ఇంజిన్‌(Search Engine)కు అనుసంధానంగా పనిచేయనుంది. ఈ కొత్త టూల్‌ నెట్‌లో అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని విశ్లేషించి, అంశాల వారీగా ప్రశ్నలకు సమాధానం వెతుకుతుంది. దీని ద్వారా వినియోగదారులు సంక్లిష్టమైన, వివరణాత్మక ప్రశ్నలకు సైతం సమగ్ర సమాధానం తెలుసుకునేందుకు సైతం అవకాశం లభించనుంది.

    Google AI Mode | ముఖ్యమైన ఫీచర్లు

    పాత మోడ్‌లో అనేక శోధనలు అవసరమయ్యే ప్రశ్నలను సైతం ఇది సులభంగా శోధిస్తుంది. వినియోగదారు అడిగిన ప్రశ్నను చిన్నచిన్న అంశాలుగా విభజించి, ఒకేసారి అనేక శోధనలను నిర్వహిస్తుంది. రియల్‌ టైమ్‌ డాటా(Realtime Data), నాలెడ్జ్‌ గ్రాఫ్‌ నుంచి సమాచారాన్ని సేకరించి అందిస్తుంది. ఇలా చేయడంవల్ల వివరణాత్మక సమాధానాలు రావడానికి అవకాశాలు మెరుగుపడతాయి.

    అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇవ్వకుండా ఈ ఏఐ మోడ్‌ వినియోగదారులకు దానికి కొనసాగింపుగా మరిన్ని ప్రశ్నలకు సైతం సమాధానం ఇస్తుంది. యూజర్లు మైక్రోఫోన్‌ ద్వారా ప్రశ్నలు అడగవచ్చు. గూగుల్‌ లెన్స్‌(Google lens)ను ఉపయోగించి ఫొటో ద్వారా కూడా సెర్చ్‌ చేయవచ్చు. ఫొటోను అప్‌లోడ్‌ చేయడం ద్వారా కూడా ఏదైనా అంశాన్ని సెర్చ్‌(Search) చేయవచ్చు. వస్తువులను పోల్చడం, ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకోవడం వంటి వివరణాత్మక ప్రశ్నలకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని గూగుల్‌ చెబుతోంది.

    Google AI Mode | ఎలా ఉపయోగించాలి..

    ఈ కొత్త మోడ్‌ గూగుల్‌ జెమిని 2.5(Gemini 2.5) ఏఐ మోడల్‌ కస్టమ్‌ వెర్షన్‌పై పనిచేస్తుంది.
    గూగుల్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌, గూగుల్‌ యాప్స్‌ సెర్చ్‌ బార్‌లో కనిపించే కొత్త ఏఐ మోడ్‌ ట్యాబ్‌ ద్వారా ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు.టైప్‌ చేయడం, వాయిస్‌ ఇన్‌పుట్‌(Voice Input) ఇవ్వడం, గూగుల్‌ లెన్స్‌ ద్వారా ఇమేజ్‌ అప్‌లోడ్‌ చేయడం ఇలా ఏ పద్ధతిలోనైనా ప్రశ్నలు సంధించవచ్చు. ఈ మోడ్‌ ప్రస్తుతానికి ఇంగ్లిష్​నే అందుబాటులో ఉంది. ఇది టెస్టింగ్‌ దశ(Testing Stage)లోనే ఉందని గూగుల్‌ తెలిపింది. ఏఐ అందించిన సమాధానాలు విశ్వసనీయంగా లేవని భావించినప్పుడు ట్రెడిషనల్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌ అందిస్తామని పేర్కొంది.

    More like this

    Prithvi Shaw | పృథ్వీ షాకు కోర్టు జరిమానా: కోర్టు నోటీసులను పట్టనందుకు రూ.100 జరిమానా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Prithvi Shaw | భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు....

    Pochampad Village | ‘సెంట్రల్‌’ వెలుగులెప్పుడో..!.. అంధకారంలో పోచంపాడ్‌ మార్గం

    అక్షరటుడే, మెండోరా : Pochampad Village | ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను చూసేందుకు జిల్లాతోపాటు ఇతర...

    Chakali Ailamma | చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తి అందరికీ...