ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMidday meals | నిలిచిన మధ్యాహ్న భోజనం.. ఇంటిదారి పట్టిన విద్యార్థులు

    Midday meals | నిలిచిన మధ్యాహ్న భోజనం.. ఇంటిదారి పట్టిన విద్యార్థులు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Midday meals | పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో విద్యార్థులు పస్తులుండిపోయారు. బుధవారం దేశవ్యాప్త కార్మికుల సమ్మెల కారణంగా జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు ఒకరోజు సమ్మె చేపట్టారు. దీంతో మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (midday meals) నిలిచిపోయింది.

    Midday meals | నిజాంసాగర్​ మండల కేంద్రంలో..

    నిజాంసాగర్ మండల కేంద్రంలోని (Nizamsagar mandal center) ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం అందించలేదు. దీంతో మాగి గోర్గుల్​, జీఎస్​ఆర్​ ఫ్యాక్టరీ వడ్డేపల్లి గ్రామాల విద్యార్థులు మధ్యాహ్నానికి ఇళ్లకు వెళ్లిపోయారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో ఉండి చదువుకునే విద్యార్థులు మాత్రం ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసి తిరిగి స్కూల్​కు వెళ్లారు. బీసీ వసతి గృహంలో విద్యార్థులకు అప్పటికప్పుడు భోజనాలు తయారు చేయించారు.

    Midday meals | ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక..

    నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం చర్చనీయాంశమైంది. దేశవ్యాప్త సమ్మె ఉన్నట్లు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఉపాధ్యాయులు మాత్రం పక్కనే ఉన్న బీసీ వసతి గృహం (BC hostel) నుంచి భోజనాన్ని తెప్పించుకొని భోజనం చేసినట్లు తెలిసింది. విద్యార్థులు మాత్రం ఇళ్లకు వెళ్లిపోయారు.

    Midday meals | ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు

    – తిరుపతిరెడ్డి, ఎంఈవో

    నిజాంసాగర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు భోజనం ఏజెన్సీ నిర్వాహకులు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో బుధవారం మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయలేకపోయారు. అందుకే విద్యార్థులు ఇంటి బాట పట్టారు. మరోసారి ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటాం.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...