అక్షరటుడే, ఆర్మూర్: MLA Prashanth Reddy | పల్లెల్లో ప్రజలందరికీ వైద్యాన్ని చేరువ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) పేర్కొన్నారు. బుధవారం బాల్కొండ నియోజకవర్గంలో రూ. 1.20 కోట్లతో నిర్మించిన మూడు పంచాయతీ భవనాలు, మూడు పల్లె దవాఖానాలను ఆయన ప్రారంభించారు.
MLA Prashanth Reddy | కేసీఆర్ ఆలోచనకు ప్రతిరూపం..
బీఆర్ఎస్ ప్రభుత్వ(BRS Government) హయాంలో వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను(Medical Colleges) ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పల్లెల్లో నాణ్యమైన వైద్యం అందాలనే ఆలోచనతో మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బాల్కొండ నియోజకరవర్గ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
MLA Prashanth Reddy | పార్టీలో చేరికలు
మెండోరా మండలం సోన్‌పేట్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఉప సర్పంచ్ చిన్నోళ్ల రమేష్, మాజీ ఎంపీటీసీ మాడుగుల నాగలక్ష్మి, తోపారం హన్మాండ్లు, రాకేష్, ముత్యం, సాగర్, మల్లేష్, ప్రశాంత్, పులి గంగాధర్, రాజన్న, శ్రావణ్, మదన్ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్న కార్యకర్తలు