More
    Homeభక్తిGuru Purnima | గురు పూజకు వేళాయె.. రేపే గురు పౌర్ణమి

    Guru Purnima | గురు పూజకు వేళాయె.. రేపే గురు పౌర్ణమి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Guru Purnima | అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు పంచేది గురువు(Guru). అందుకే మన సంప్రదాయం గురువుకు అగ్రస్థానాన్ని కల్పించింది. గురువును బ్రహ్మ, విష్ణు(Vishnu), మహేశ్వరులు కలగలసిన రూపంగా భావిస్తాం.

    గురు పౌర్ణమి సందర్భంగా గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. హిందూ (Hindu) మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. గురువారం గురుపౌర్ణమి(Guru Purnima). ఈ సందర్భంగా గురుపౌర్ణమి విశిష్టత, దత్తక్షేత్రాల గురించి తెలుసుకుందామా..

    ఆది యోగి(Adi Yogi), ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణమినాడే సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతోంది. దత్తాత్రేయుడు(Dattatreya) తన శిష్యులకు జ్ఞాన బోధ చేసింది ఆషాఢ పౌర్ణమి రోజేనని దత్త చరిత్ర చెబుతోంది. వ్యాస మహర్షి(Maharshi Vyasa) జన్మించింది, వేదాలను రుక్‌, యజుర్‌, సామ, అధర్వణ వేదాలుగా విభజించిందీ ఈ రోజే. ఇలా ఆషాఢ శుద్ధ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఆషాఢ(Ashadha) శుద్ధ పౌర్ణమిని గురుపౌర్ణమిగా జరుపుకుంటాం. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించినందుకు ఈ రోజున శిష్యులు గురుపూజోత్సవం(Guru pujotsavam) నిర్వహించి గురువులను సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు.

    Guru Purnima | ఆది గురువు దత్తాత్రేయుడు..

    దత్తాత్రేయుడు బ్రహ్(Brahma)మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం. ఆయన జ్ఞానం, యోగం, భక్తి మార్గాలకు మూలాధారం. ఆధ్యాత్మిక జ్ఞానానికి మూలాధారమైనందున ఆయన ఆది గురువు(Adi Guru)గానూ పూజలందుకుంటున్నాడు. ఆషాఢ పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. దీంతో గురు పౌర్ణమి రోజున దత్త క్షేత్రాలలో దత్తాత్రేయుడికి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, పాదపూజలు నిర్వహిస్తారు.

    ఈ రోజు గురు గ్రహ దోషాలు, పితృ దోషాల నుంచి విముక్తి కోసం భక్తులు దత్తాత్రేయుడిని ఆరాధిస్తారు. పసుపు రంగు(Yellow colour)ను గురు గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. అందుకే ఈ రోజున గురువులకు పసుపు వస్తువులను సమర్పించడాన్ని శుభప్రదంగా పరిగణించబడుతోంది. పసుపు రంగు వస్తువులైన పుష్పాలు, దుస్తులు, పండ్లు(Fruits) సమర్పిస్తారు. గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయుని ఆరాధించడం ద్వారా జీవితంలో సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం.

    Guru Purnima | ప్రముఖ దత్త క్షేత్రాలు..

    మహారాష్ట్రలోని గిరినర్‌(Girnar)లో గల దత్త క్షేత్రాన్ని మహిమాన్వితమైనదిగా భావిస్తారు. ఇక్కడ ఆ దత్తాత్రేయుడు తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఏటా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ దత్తాత్రేయ హోమం, అభిషేకం, సామూహిక దత్త స్తోత్ర పారాయణం, రాత్రి జాగరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

    కర్ణాటక రాష్ట్రం మైసూర్‌(Mysore)లోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం ప్రముఖ దత్తపీఠంగా ప్రసిద్ధికెక్కింది. దీనిని శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ స్థాపించారు. గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ దత్తాత్రేయ హోమం, గురు పూజ, భక్తి సంగీత కార్యక్రమాలు, ధ్యాన సభలు నిర్వహిస్తారు. భక్తులు స్వామీజీకి పాదపూజ చేసి ఆశీర్వాదాలు స్వీకరిస్తారు.

    హైదరాబాద్‌(Hyderabad)లోని దత్త పీఠంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక ధ్యాన సభలు, గురు పాదుకా పూజలు నిర్వహిస్తారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు(Guntur)లోగల దత్త యోగ కేంద్రంలో గురువారం ప్రారంభమైన గురుపౌర్ణమి వేడుకలు మూడు రోజుల పాటు సాగనున్నాయి. దత్తాత్రేయ హోమం, పాదపూజ, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం(Pitapuram)లో శ్రీదత్త ఆలయం ఉంది. దత్తాత్రేయ అవతారంగా భావించబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలం ఇది. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ అభిషేకం, దత్త స్తోత్రం, గురు పూజ జరుగుతాయి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పారాయణం చేస్తారు.

    More like this

    September 16 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 16 Panchangam | తేదీ (DATE) – సెప్టెంబరు 16,​ 2025 పంచాంగం (today horoscope) శ్రీ...

    Urea bag theft | చేనులో యూరియా బస్తా చోరీ.. వాట్సప్​లో వైరల్..​ ఎక్కడంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea bag theft | వానా కాలం rainy season సాగు మొదలై నాలుగు నెలలవుతున్నా.....

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...