ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​YS Jagan | జగన్​ పర్యటనలో ఉద్రిక్తత

    YS Jagan | జగన్​ పర్యటనలో ఉద్రిక్తత

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Jagan | ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్​ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వైఎస్​ జగన్​(YS Jagan) బుధవారం బయలు దేరారు. అయితే ఇటీవల రెంటపాళ్ల పర్యటనలో జగన్​ కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బంగారుపాళ్యం పర్యటన(Bangurapalyam Tour)కు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.

    YS Jagan | భారీగా తరలివచ్చిన శ్రేణులు

    జగన్​ పర్యటనలో అనుమతులు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ మణికంట(SP Manikanta) పేర్కొన్నారు. రోడ్​ షోకు అనుమతి లేదని, 500 మంది మామిడి రైతులతో మాట్లాడటానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జన సమీకరణ, ర్యాలీలు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు.
    ఈ క్రమంలో ఆయన పర్యటనకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. అయినా భారీగా కార్యకర్తలు, శ్రేణులు తరలి వచ్చాయి. దీంతో బంగారుపాళ్యంలో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జీ(Police Lathi Charge) చేశారు. దీతో జగన్​ కాన్వాయ్‌ నుంచి దిగేందుకు యత్నించారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారని కారు దిగి గాయపడ్డ కార్యకర్త దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకునాడు. కాగా బంగారుపాళ్యం చేరుకున్న జగన్​ కాసేపట్లో మార్కెట్​ యార్డులో మామిడి రైతులతో(Mango Farmers) మాట్లాడనున్నారు.

    YS Jagan | ఆటంకాలు సృష్టిస్తున్నారు

    జగన్ పర్యటనకు ఆటంకాలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ఆరోపించారు. జగన్‌ కోసం వచ్చిన ప్రజలపై లాఠీఛార్జ్ చేశారన్నారు. రౌడీషీట్ ఓపెన్ చేస్తామని పార్టీ శ్రేణులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. పోలీసుల తీరును ఆయన ఖండించారు.

    More like this

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...