ePaper
More
    Homeబిజినెస్​Stock Market | ఫ్లాట్‌గా కొనసాగుతున్న సూచీలు

    Stock Market | ఫ్లాట్‌గా కొనసాగుతున్న సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | యూఎస్‌తో ట్రేడ్‌ డీల్‌(Trade deal), టారిఫ్‌ల విషయంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొని ఉండడంతో ప్రారంభంలో సూచీలు కొంత ఒత్తిడికి లోనైనా ఆ తర్వాత తేరుకున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాట కొనసాగుతోంది. బుధవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 87 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 106 పాయింట్లు కోల్పోయింది. అక్కడినుంచి కోలుకుని ఇంట్రాడేలో గరిష్టంగా 190 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 42 పాయింట్లు క్షీణించింది. కనిష్టాల వద్ద లభించిన మద్దతులో ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 76 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 20 పాయింట్ల నష్టంతో 83,691 వద్ద, నిఫ్టీ(Nifty) 6 పాయింట్ల నష్టంతో 25,522 వద్ద కొనసాగుతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌(Tata steel), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎల్‌అండ్‌టీ వంటి స్టాక్స్‌ నష్టాల బాటలో ఉండగా.. హెచ్‌యూఎల్‌, ఆసియన్‌ పెయింట్‌, శ్రీరాం ఫైనాన్స్‌, సిప్లా, మారుతి(Maruti) వంటి స్టాక్స్‌ లాభాలతో సాగుతున్నాయి.

    Stock Market | మిశ్రమంగా సూచీలు

    ఫార్మా(Pharma), కన్జూమర్‌ డ్యూరెబుల్‌ సెక్టార్లలో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తుండగా.. బ్యాంక్‌, ఐటీ, మెటల్‌, రియాలిటీ సెక్టార్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బీఎస్‌ఈలో యుటిలిటీ (Utility) ఇండెక్స్‌ 0.70 శాతం పెరగ్గా.. ఎఫ్‌ఎంసీజీ 0.65 శాతం, పవర్‌ 0.55 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్‌ సూచీ 0.46 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.38 శాతం, ఇన్‌ఫ్రా 0.33 శాతం లాభాలతో సాగుతున్నాయి. రియాలిటీ ఇండెక్స్‌ 1.03 శాతం నష్టపోగా.. మెటల్‌ 0.89 శాతం, ఐటీ 0.51 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.42 శాతం, పీఎస్‌యూ బ్యాంక్‌ 0.30 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.53 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.07 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.04 శాతం లాభాలతో ఉన్నాయి.

    Top gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో 14 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. హెచ్‌యూఎల్‌ 1.26 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.93 శాతం, మారుతి 0.79 శాతం, ఆసియా పెయింట్‌ 0.62 శాతం, ఎంఅండ్‌ఎం 0.54 శాతం లాభాలతో సాగుతున్నాయి.

    Top losers:టాటా స్టీల్‌ 1.95 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.28 శాతం, ఎల్‌అండ్‌టీ 0.80 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.74 శాతం, టెక్‌ మహీంద్రా 0.50 శాతం నష్టాలతో ఉన్నాయి.

    More like this

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...