ePaper
More
    HomeజాతీయంBridge Collapsed | గుజరాత్‌లో కుప్పకూలిన వంతెన.. నదిలో పడిపోయిన వాహనాలు

    Bridge Collapsed | గుజరాత్‌లో కుప్పకూలిన వంతెన.. నదిలో పడిపోయిన వాహనాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Bridge Collapsed | గుజరాత్​(Gujarat)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వంతెన వాహనాలు వెళ్తున్న సమయంలో అకస్మత్తుగా కూలిపోయింది. వడోదర- ఆనంద్‌ పట్టణాల మధ్య పద్రా దగ్గర మహిసాగర్ నదిపై బ్రిడ్జి(Mahisagar River Bridge) కూలిపోయింది.

    ఆ సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి.
    రెండు ట్రక్కులు, రెండు వ్యాన్​లు నదిలో పడిపోగా.. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల్లోని పలువురిని రక్షించారు. సమాచారం అందుకున్న అధికారులు పోలీసులు(Gujrat Police) ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో నదిలో కొందరు గల్లంతయినట్లు సమాచారం. వారి కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి. వంతెన కూలడంతో వడోదర-ఆనంద్‌ పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

    Bridge Collapsed | గతంలో సైతం..

    గుజరాత్‌లోని సురేంద్ర నగర్‌ జిల్లా(Surendranagar District) వస్తాది గ్రామంలో 2023 సెప్టెంబర్​లో ఒక పాత వంతెన కూలిపోయింది. ఆ సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న డంపర్‌తో సహా రెండు బైక్‌లు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో పది మంది నీటిలో పడిపోగా.. స్థానికులు, సహాయక బృందాలు రక్షించాయి.గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల ముందు 2022 అక్టోబర్​లో మోర్బీ పట్టణంలోని కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 140 మంది మరణించారు.

    Latest articles

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    More like this