ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఎంత పెరిగాయంటే..!

    Today Gold Price | మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఎంత పెరిగాయంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం మళ్లీ షాక్​ ఇచ్చింది. పసిడి ప్రియులను నిరాశ పరిచింది. బంగారం ధరలు (Gold rates) తగ్గుతాయని ఆశించిన వారికి చుక్కలు చూపిస్తూ మళ్లీ ధరలు పెరిగాయి.

    శ్రావణ మాసం సమీపిస్తున్న తరుణంలో శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారు ఇప్పుడు బంగారం రేట్లను చూసి ఆందోళన చెందుతున్నారు.

    ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు (Today Gold rates) ఆకాశాన్నంటుతున్నాయి. జులై 9, 2025 బుధవారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,610గా ఉంది. నిన్నటితో పోలిస్తే పోలిస్తే నేడు రూ.10 పెరిగింది.

    Today Gold Price : మ‌హిళ‌ల‌కు షాక్‌..

    హైదరాబాద్‌లో 24 క్యారెట్లు – రూ.98,850 ఉండ‌గా, 22 క్యారెట్లు – రూ.90,610, కిలో వెండి – రూ.1,19,800గా ట్రేడ్ అయింది. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లో 24 క్యారెట్లు – రూ.98,850, 22 క్యారెట్లు – రూ.90,610, కిలో వెండి – రూ.1,19,800గా న‌మోద‌య్యాయి.

    బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ ఉండ‌డం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర రూ.11,990 దగ్గర ట్రేడ్ కాగా, కేజీ వెండి (Silver) ధర రూ.1,19,900గా ఉంది.

    అయితే, ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గ‌డంతో 100 గ్రాముల వెండి ధర నేడు రూ.11,980 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర రూ.1,19,800 దగ్గర ట్రేడ్ అవుతుంది.

    రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు మధ్యతరగతి కుటుంబాలకు పెద్దభారం అవుతున్నాయి. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సమయాల్లో కొనుగోలు చేయాల‌నుకునే వారు పెరిగిన ధ‌ర‌ల‌ను ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న పరిస్థితులు, డాలర్ (Dollar) – రూపాయి మారకం, ముడి బంగారం ధరల మార్పుల ప్రభావం వీటిపై స్పష్టంగా కనిపిస్తోంది.

    Latest articles

    Teacher Promotions | హెచ్ఎం ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్​.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

    అక్షరటుడే, ఇందూరు : Teacher Promotions | రాష్ట్రంలో ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో...

    Tiger | లేగదూడపై చిరుత దాడి.. ఎక్కడంటే..

    అక్షరటుడే, కామారెడ్డి: Tiger | ఉమ్మడి మాచారెడ్డి (machareddy) మండలంలో చిరుత పులుల సంచారం ప్రజలను ఆందోళనకు గురి...

    Drunk Driving | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో పలువురికి జైలు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Drunk Driving | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో పలువురికి జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది....

    Guvvala Balaraju | ప్రతిపక్ష పాత్రలో బీఆర్‌ ఎస్‌ విఫలం.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Guvvala Balaraju | నాగర్‌ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Former Nagarkurnool MLA...

    More like this