అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు దేవాదాయ ధర్మదాయ శాఖ(Endowment and Charitable Endowments Department) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Bomma Mahesh Kumar Goud), నుడా ఛైర్మన్ కేశ వేణు(Nuda Chairman Kesha Venu) సూచించిన వారికే పాలక మండళ్లలో పదవులు దక్కాయని తెలుస్తోంది.
కాగా, పాలక మండళ్ల ఛైర్మన్, డైరెక్టర్ పదవులను ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి దక్కినట్లు స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలోని సీనియర్ కార్యకర్తలు అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం.
Nizamabad : శంభుని గుడి ఆలయ కమిటీ ఛైర్మన్‌గా..
నిజామాబాద్ జిల్లా(Nizamabad district) కేంద్రంలోని స్వయంభూ గా వెలిసిన శంభూలింగేశ్వర ఆలయాని(Shambhulingeswara temple)కి నూతన కమిటీని నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా పూసల మధు అలియాస్ బింగి మధు నియామకమయ్యారు. డైరెక్టర్లుగా గాజుల కిషోర్, కమల్ కిషోర్ దయామా, గాండ్ల సంతోష్ కుమార్, మామిడి శేఖర్, గోపు రేఖ అలియాస్ ఎర్రం రేఖ, ఉప్పల రమేష్ నియమితులయ్యారు.
Nizamabad : జెండా బాలాజీ ఆలయానికి..
నగరంలోని జండాగల్లిలో ప్రసిద్ధ జెండా బాలాజీ ఆలయాని(Jenda Balaji Temple)కి కొత్త కమిటీ ఏర్పడింది. ఛైర్మన్‌గా లవంగ ప్రమోద్ నియమితులయ్యారు. ధర్మకర్తలుగా సిరిపురం కిరణ్ కుమార్, పోలకొండ నర్సింగ్ రావు, వేముల దేవిదాస్, మంత లక్ష్మణ్, కోర్వ రాజ్ కుమార్, పవార్ విజయ ఎంపికయ్యారు.
Nizamabad : హమాల్వాడీలోని…
నగరంలోని హమాల్‌వాడీ(Hamalwadi)లోని సంతోషీమాత(Santoshi Mata), సాయిబాబా ఆలయాల(Sai Baba temples)కు కూడా నూతన కమిటీలు వచ్చాయి. ఛైర్మన్‌గా బోదుకం గంగా కిషన్ నియమితులయ్యారు. డైరెక్టర్లుగా శ్రీరాం శ్రీనివాస్, బాణాల శివ లింగం, గాదే ప్రవీణ్ కుమార్, శాంతాబాయిని నియమించారు.
Nizamabad : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు..
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరులోగా లోకల్‌బాడీ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవలే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆలయాల పాలక మండళ్లలో పదవులు దక్కనివారిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.