ePaper
More
    Homeక్రైంHyderabad | ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ మందుల విక్రయం

    Hyderabad | ప్రజల ప్రాణాలతో చెలగాటం.. నకిలీ మందుల విక్రయం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | కొందరు వ్యక్తులు తమ లాభం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ (Counterfeit) వస్తువులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. హైదరాబాద్​ పోలీసులు ఇటీవల దాడులు చేసి భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్​, నెయ్యి, పనీర్​ను స్వాధీనం చేసుకున్నారు. 46 కేసులు నమోదు చేసి 52 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా డ్రగ్​ కంట్రోల్​ అధికారులు (DCA) నకిలీ మెడిసిన్ (Counterfeit Medicine)​ అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే మార్కెట్​లో ప్రతీది కల్తీ చేస్తున్న మాఫియా తాజాగా మందులను కూడా కల్తీ చేస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    Hyderabad | నకిలీ లెవిపిల్ 500 విక్రయం

    డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు మంగళవారం హైదరాబాద్‌ (Hyderabad)లోని అరవింద్ ఫార్మా (Arvind Pharma) డిస్ట్రిబ్యూటర్స్ భాగస్వామి-కమ్-కంపెటెంట్ పర్సన్ మనీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. సన్ ఫార్మా (Sun Pharma) లాబొరేటరీస్ లిమిటెడ్ తయారు చేసినట్లు నకిలీ ‘లెవిపిల్ 500’ టాబ్లెట్‌లను ఆయన విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

    జులై 4న హైదరాబాద్‌లోని గాంధీనగర్‌లోని డిస్టిబ్యూటర్​ ఇంట్లో దాడి చేశారు. అక్కడ దొరికిన సమాచారం ఆధారంగా తాజాగా మనీష్​ కుమార్​ను అరెస్ట్​ చేశారు. నిందితుడిని సికింద్రాబాద్‌లోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా జులై 23 వరకు రిమాండ్​ విధించారు. ఈ మందులు నకిలీవని నిర్ధారించిన డీసీఏ దర్యాప్తు చేస్తోంది. నకిలీ మందులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా లెవిపిల్​ 500 మెడిసిన్​ మూర్చ వ్యాధి తగ్గడానికి వినియోగిస్తారు.

    More like this

    UPI limit increased | యూపీఐ సేవల్లో కీలక మార్పులు.. పర్సన్ టు మర్చంట్ పరిమితి రూ.10 లక్షలకు పెంపు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI limit increased : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ UPI) సేవల్లో కీలక మార్పులు...

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...