ePaper
More
    HomeజాతీయంAccounts Block | ఖాతాల బ్లాకింగ్​పై వివాదం రాజేసిన ‘ఎక్స్’.. ఇండియాలో ప్రెస్ సెన్సార్ షిప్​పై...

    Accounts Block | ఖాతాల బ్లాకింగ్​పై వివాదం రాజేసిన ‘ఎక్స్’.. ఇండియాలో ప్రెస్ సెన్సార్ షిప్​పై ఆందోళన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Accounts Block | కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘X’ మధ్య వివాదం రాజుకుంటోంది. ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని ఈ సోషల్ మీడియా సంస్థ.. ఇండియాలో కొనసాగుతున్న ప్రెస్ సెన్షార్ షిప్ గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

    ఇండియాలో గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ (global news agency Reuters) ఖాతాను నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఎక్స్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. రాయిటర్స్ ఖాతాను ఎక్స్ ఇటీవల నిలిపి వేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము ఆ పని చేశామని సదరు సంస్థ చెప్పగా, తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం ఖండించింది. ఈ నేపథ్యంలోనే వివాదం రాజుకోగా, దాన్ని మరింత రాజేస్తూ ‘ఎక్స్’ తాజాగా ఇండియాలో ప్రెస్ సెన్సార్ షిప్ కొనసాగుతోందని ప్రకటించింది.

    Accounts Block | బ్లాక్ చేయాలని ఆదేశాలు..

    ఇండియాలోని 2,355 ఖాతాలను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించిందని ‘ఎక్స్’ మంగళవారం తెలిపింది. వీటిలో వార్తా సంస్థ రాయిటర్స్​కు చెందిన ఖాతాలు కూడా ఉన్నాయని పేర్కొంది. దీనిపై గతంలో కేంద్ర ఐటీ శాఖ (central IT department) విడుదల చేసిన ప్రకటనను కొట్టిపడేస్తూ ‘ఎక్స్’ తాజాగా ఈ మేరకు స్పందించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద ఈ ఉత్తర్వు జారీ చేయబడిందని, దీనిని పాటించకపోవడం నేరపూరిత బాధ్యతకు దారి తీస్తుందని పేర్కొంది. సెన్సార్​షిప్​, కంటెంట్ తొలగింపు ఆదేశాలపై ‘ఎక్స్’, కేంద్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన తీవ్రతను ఈ పరిణామం అద్దం పడుతోంది.

    Accounts Block | చట్టపరమైన చర్యలపై ఫోకస్..

    ఇండియాలో ప్రెస్ సెన్సార్ షిప్​పై ఆందోళనతో ఉన్నామని ‘ఎక్స్’ పేర్కొంది. “ఒక గంటలోపు తక్షణ చర్య తీసుకోవాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) డిమాండ్ చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఖాతాలను బ్లాక్ చేయాలని కోరింది. ప్రజల నిరసనల తర్వాత ప్రభుత్వం @Reuters మరియు @ReutersWorldలను అన్​బ్లాక్​ చేయమని ‘X’ని అభ్యర్థించింది” అని కంపెనీ తన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ ఖాతాలో (Global Government Affairs account) పోస్ట్ చేసింది.

    ఈ బ్లాకింగ్ ఆర్డర్ల కారణంగా భారతదేశంలో కొనసాగుతున్న ప్రెస్ సెన్సార్ షిప్ గురించి తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన ఎంపికలను అన్వేషిస్తున్నామని ‘X’ పేర్కొంది.

    భారతదేశంలో ఉన్న వినియోగదారులు సెన్సార్ షిప్​పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ కార్యనిర్వాహక ఆదేశాలకు వ్యతిరేకంగా చట్టపరమైన సవాళ్లను తీసుకురావడంలో ‘ఎక్స్’ భారతీయ చట్టం ద్వారా పరిమితం చేయబడిందని, ఈ నేపథ్యంలో ప్రభావిత వినియోగదారులు కోర్టుల ద్వారా చట్టపరమైన పరిష్కారాలను అనుసరించాలని తాము కోరుతున్నామని పేర్కొంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...