అక్షరటుడే, వెబ్డెస్క్ : Gaming Case | పేకాట స్థావరంపై దాడి చేసి భారీగా నగదు పట్టుకున్నట్లు సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారీ acp nagendra chary తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆలూర్ బైపాస్ aaloor bypass బైపాస్ రోడ్డులోని ఓ గెస్ట్ హౌస్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సీసీఎస్ ఎస్సై రవికుమార్ బృందం ఆదివారం దాడి చేసినట్లు తెలిపారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని ఏడు ఫోన్లు, రూ.2,56,830 సీజ్ చేశామన్నారు. ఇందులో రూ.21,830 నగదు, మిగతావి ఫోన్ పే ద్వారా బెట్టింగ్ betting పెట్టారని చెప్పారు. ఖాతాల్లోని నగదు కూడా సీజ్ చేశామన్నారు.