ePaper
More
    HomeతెలంగాణNizamabad GGH | తీరు మారేనా..!

    Nizamabad GGH | తీరు మారేనా..!

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad GGH | నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (Nizamabad District Government General Hospital) ప్రభుత్వం పూర్తిస్థాయి సూపరింటెండెంట్​ను నియమించింది. సుమారు పదేళ్లుగా ఇన్​ఛార్జీల పాలనలో ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా మారింది. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. పారిశుధ్యం, సిబ్బంది సమయపాలన, పరికరాల కొరత, నిర్వహణ లోపం ఇలా అనేక సమస్యలతో దీనస్థితికి చేరింది. కాగా.. కొత్త సూపరింటెండెంట్​ రానుండడంతో ఇప్పటికైనా సమస్యలు పరిష్కారమై ఆస్పత్రి గాడిలో పడుతుందని జిల్లావాసులు ఆశిస్తున్నారు.

    నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో 13 ఏళ్ల క్రితం జనరల్​ ఆస్పత్రి కోసం ఏడంతస్తుల అద్దాలమేడ నిర్మించారు. తొలుత 500 పడకలతో ఏర్పాటు చేయగా.. తదనంతర కాలంలో 700 పడకల ఆస్పత్రిగా (700-beds hospital) అప్​గ్రేడ్​ చేశారు. ప్రారంభంలో మెరుగైన సేవలు అందించినా.. కొంత కాలం తర్వాత సమస్యలు తాండవిస్తున్నాయి.

    Nizamabad GGH | డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తం

    జీజీహెచ్​లో ప్రధానంగా డ్రెయినేజీ వ్యవస్థ (GGH drainage system) పూర్తిగా దెబ్బతినడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఇన్ పేషెంట్లు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి కాల్వలకు సంబంధించిన పైప్ లైన్లు ధ్వంసం అవడంతో మురికి నీరంతా ఆవరణలో పారుతోంది. అలాగే తాగునీటి వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అలాగే ఆస్పత్రి అద్దాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. దీంతో వర్షాకాలం, చలికాలం రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. వీటి మరమ్మతులకు రూ.3 కోట్ల నిధులు అవసరమని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటివరకు మంజూరు కాలేదు.

    Nizamabad GGH | స్ట్రెచర్ల కొరతతో ఇబ్బందులు

    పెద్దాసుపత్రికి వైద్యం కోసం నిత్యం వేల మంది వస్తుంటారు. ప్రస్తుత సీజన్​లో నిత్యం సుమారు 2 వేలకు పైగానే ఓపీ నమోదవుతుంది. ఇందులో సుమారు 500 మంది వరకు ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతారు. అయితే రోగుల సంఖ్యకు అనుగుణంగా స్ట్రెచర్లు, వీల్​ చైర్లు లేకపోవడం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవేళ అందుబాటులో ఉన్నా.. రోగులను తీసుకెళ్లేందుకు వార్డు బాయ్​లు దొరకరు. దీంతో బంధువులే వార్డు బాయ్ల అవతారం ఎత్తే పరిస్థితి నెలకొంటుంది.

    Nizamabad GGH | సిబ్బంది కొరత..

    జిల్లా జనరల్ ఆస్పత్రి (District General Hospital) నిర్మించిన నాటి నుంచి సిబ్బంది కొరత తీవ్రంగానే ఉంది. సగానికి పైగా ఖాళీలు ఉండడంతో ఒక్కోసారి వైద్యం పూర్తిస్థాయిలో అందడం లేదు. జీజీహెచ్​కు మొత్తం 281 మంది ఉండాల్సి ఉండగా.. రెగ్యులర్ సిబ్బంది 104 మంది, కాంట్రాక్టు సిబ్బంది 69 మంది ఉన్నారు. కాగా.. 108 ఖాళీలు ఉన్నాయి. అలాగే పారిశుధ్య కార్మికులు (sanitation workers) సైతం పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఉన్నవారిపైనే భారం పడుతోంది.

    Nizamabad GGH | దొంగతనాలూ ఎక్కువే..

    జిల్లా జనరల్ ఆస్పత్రిలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. బంగారు ఆభరణాలు (gold ornaments) ఎత్తుకెళ్లిన ఘటనలు ఉండగా.. పలుమార్లు చిన్నారులను అపహరించిన దాఖలాలు ఉన్నాయి. పగలంతా రోగి బంధువులపై ఆజామాయిషీ చేసే సెక్యూరిటీ సిబ్బంది రాత్రి వీధుల్లో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని స్పష్టం అవుతోంది.

    Nizamabad GGH | మంత్రి హెచ్చరించినా..

    గతేడాది ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) జీజీహెచ్​ను సందర్శించారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై చర్చించారు. వైద్యుల హాజరు, సిబ్బంది పనితీరు, పరిశుభ్రత, ఆస్పత్రి నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మంత్రి స్పందన తీరుతో ఆస్పత్రి నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    Nizamabad GGH | మాతా శిశు కేంద్రం ప్రారంభమయ్యేనా..

    జిల్లా జనరల్ ఆస్పత్రికి రోగుల తాకిడి అధికంగా ఉండడంతో గర్భిణులు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా కేంద్రం నిర్మించారు. నిజామాబాద్ బస్టాండ్ (Nizamabad bus stand) ఎదురుగా రూ.4కోట్లతో ఏడాదిన్నర క్రితం నిర్మాణం పూర్తి చేశారు. కానీ ఇప్పటికీ ఆ భవనాన్ని ప్రారంభించలేదు. ఒకే లిఫ్ట్ ఉన్నదనే కారణంతో వినియోగించడం లేదని సమాచారం. ఇప్పటికైనా అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...