ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​SSC Notification | ఎస్సెస్సీలో టెన్త్​తో కొలువులు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌

    SSC Notification | ఎస్సెస్సీలో టెన్త్​తో కొలువులు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: SSC Notification | పదో తరగతి విద్యార్హతతో పలు పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎస్సెస్సీ (10th Class) విద్యార్హతతో 1,075 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, హవల్దార్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అలాగే ఇంజినీరింగ్‌ విద్యార్హతతో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి కూడా చర్యలు చేపట్టింది. ఆయా పోస్టులకు అర్హతలు, ఎంపిక విధానం తెలుసుకుందామా..

    ఎంటీఎస్‌(MTS), హవల్దార్‌ పోస్టులు మొత్తం : 1,075.
    విద్యార్హత : పదో తరగతి.
    వయసు : 18 నుంచి 27 ఏళ్లలోపువారు అర్హులు.
    వేతనం : రూ. 18 వేలనుంచి రూ. 56,900 వరకు..
    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    దరఖాస్తు గడువు : ఈనెల 24 వరకు. ఫీజు చెల్లించడానికి ఈనెల 25 వరకు గడువుంది. దరఖాస్తులను సవరించుకోవడానికి 29 నుంచి 31వ తేదీ వరకు అవకాశం ఉంది.
    పరీక్ష తేదీ : సెప్టెంబర్‌ 20వ తేదీనుంచి అక్టోబర్‌ 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు.
    ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(CBT)తోపాటు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాల కోసం https://ssc.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించండి.

    SSC Notification | ఇంజినీరింగ్‌ పోస్టులు..

    ఎస్సెస్సీ వివిధ శాఖల్లో గ్రూప్‌ బీ(నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) స్థాయిలో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్‌ ఇచ్చింది. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాలలో పోస్టులను భర్తీ చేయనున్నారు.
    మొత్తం పోస్టులు : 1,340
    అర్హత : సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌(Engineering) విభాగాలలో డిప్లొమా లేదా డిగ్రీ పాస్‌ అయి ఉండాలి.
    వయో పరిమితి : వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 30 ఏళ్లలోపు వయసువారు అర్హులు. దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ(OBC)లకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది.
    వేతనం : రూ. 35,400 నుంచి రూ. 1.12 లక్షల వరకు.
    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    దరఖాస్తు గడువు : ఈనెల 21వ తేదీ. ఫీజు చెల్లించడానికి గడువు 22 వ తేదీ వరకు ఉంది. దరఖాస్తులను సవరించుకోవడానికి August 1, 2 తేదీలలో అవకాశం ఉంది.
    ఎంపిక విధానం : కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
    పరీక్ష తేదీలు : పేపర్‌ -1ను అక్టోబర్‌ 27 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తారు. పేపర్‌ -2 వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించే అవకాశాలున్నాయి. వివరాల కోసం https://ssc.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించండి.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....