ePaper
More
    HomeతెలంగాణCity Civil Court | సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

    City Civil Court | సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: City Civil Court | హైదరాబాద్(Hyderabad)​ నగరంలోని పాతబస్తీలో గల సిటీ సివిల్​ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్​ చేసి కోర్టులో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కోర్టు కార్యకలాపాలు(Court Proceedings) నిలిపివేసి తనిఖీలు చేపడుతున్నారు.

    చీఫ్‌ మేజిస్ట్రేట్‌ (Chief Magistrate) కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతి ఇచ్చారు. దీంతో న్యాయస్థానంలో ఉన్న లాయర్లు, ప్రజలను పోలీసులు బయటకు పంపించారు. డాగ్‌స్వ్కాడ్‌, బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు చేపడుతున్నారు. సిటీ సివిల్ కోర్టు (City Civil Court)తో పాటు మరో నాలుగు చోట్ల సైతం బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు చెప్పడంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల హన్మకొండ కోర్టుకు సైతం బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. జూన్​ 20న కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్​ చేశాడు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా ఆరు డిటోనేటర్లు లభ్యం అయ్యాయి. కోర్టులకు బాంబు బెదిరింపులు వస్తుండడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు.

    City Civil Court | పెరిగిన బెదిరింపు కాల్స్​

    కాగా.. ఇటీవల బెదిరింపు కాల్స్​(Threatening Calls) ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. చాలా వరకు బెదిరింపు కాల్స్​ నకిలివేనని అధికారులు తనిఖీల అనంతరం గుర్తిస్తున్నారు. అయితే బాంబు పెట్టామని ఫోన్లు చేస్తుండడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. తనిఖీలతో ప్రయాణికులు, కార్యాలయాల సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధికారుల సమయం వృథా అవుతోంది. పలు విమానాలకు సైతం బాంబు బెదిరింపులు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్​ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి నకిలీ కాల్స్​ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

    More like this

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...

    RBI land transaction | వామ్మో.. ఎకరం ధర ఏకంగా రూ.800 కోట్లు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RBI land transaction | రిజర్వు బ్యాంకు(ఆర్​బీఐ)ను భారత్​ కేంద్ర బ్యాంకుగా పేర్కొంటారు. భారతీయ రిజర్వ్...